భారత్ తొలి ఇన్నింగ్స్ 318.. ఆచితూచి ఆడుతున్న కివీస్
posted on Sep 23, 2016 @ 11:49AM
భారత్-న్యూజిలాండ్ మధ్య 500వ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. తొలి టెస్టు మ్యాచ్‌లో 318 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 291/9తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు.. రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు కేవలం 27 పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. 300 పరుగుల మైలురాయిని అందుకోగలిగింది.
ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టు ఆచితూచి ఆడుతోంది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేస్తున్నప్పటికీ ఎలాంటి తడబాటు లేకుండా న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఓపెనర్లు గుప్తిల్ (21), లాతమ్ (20) క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. పదో ఓవర్లో మ్యాజిక్ చేసిన ఉమేష్ యాదవ్ అద్భుతమైన బంతిని సంధించి గుప్తిల్ ను ఎల్బిడబ్ల్యూగా పెవిలియన్ కు పంపాడు. అనంతరం లాతమ్ కు కెప్టెన్ విలియమ్సన్ (7)జత కలిశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు తొలి సెషన్ లో 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 56 పరుగులు చేసింది.