రెండో వన్డే.. బోణి కొట్టేందుకు కివీస్..
posted on Oct 20, 2016 @ 1:18PM
భారత్ టాస్ లు గెలవడంతో పాటు వరుసగా మ్యాచ్ లు కూడా గెలుస్తూ న్యూజిలాండ్ కు చుక్కలు చూపిస్తుంది. కివీస్, భారత్ కు మధ్య జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లలో భారత్ ఘన విజయం సాధించగా.. ఇప్పుడు వన్డే మ్యాచుల్లో కూడా తన ప్రతాపం చూపిస్తోంది. మొన్న జరిగిన వన్డేలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే మరో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే టాస్ గెలిచిన టీ మిండియా.. తొలుత ఫీల్డింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపింది. కాగా ఈ మ్యాచ్ లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, న్యూజిలాండ్ జట్టు మూడు మార్పులు చేసింది. గత మ్యాచ్ లో ఆడిన నీషమ్, బ్రాస్ వెల్, సోధీలకు విశ్రాంతి నిచ్చి, వారి స్థానంలో బౌల్ట్, హెన్రీ, డెవిచిచ్ లను తుది జట్టులోకి తీసుకుంది. మొత్తం న్యూజిలాండ్-ఇండియా మధ్య ఐదు వన్డే సిరీస్ లు జరగనున్నాయి.