భారత్ రెండో స్థానంలోనే
posted on Apr 5, 2011 @ 10:21AM
దుబాయ్: ప్రపంచకప్ గెలిచినా భారత్‌కు ఇంకా నెంబర్‌వన్ స్థానం అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో పాయింట్లు మెరుగుపరచుకున్నప్పటికీ ఇంకా ఏడు పాయింట్లతో ఆస్ట్రేలియా కంటే భారత్ (121) వెనుకబడింది. ఇక రన్నరప్ శ్రీలంక (118) మూడో స్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా ఆ తరువాత స్థానంలో ఉంది. కాగా భారత్ క్రికెటర్ల ర్యాంకులు మెరుగయ్యాయి. సచిన్, గంభీర్ టాప్ టెన్‌లో చోటు సంపాదించారు. సచిన్ ఒకటి, గంభీర్ నాలుగు స్థానాలు మెరుగు పరచుకొని వరుసగా తొమ్మిది, పది ర్యాంక్‌లకు చేరుకున్నారు.
ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (500)చేసిన తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) కెరీర్‌లో అత్యుత్తమంగా మూడో ర్యాంకుకు దూసుకెళ్లాడు. 'మ్యాన్ ఆఫ్ ది టోర్నీ' యువరాజ్ సింగ్ ఆరుస్థానాలు మెరుగుపరచుకొని ఆసీస్ స్టార్ రికీ పాంటింగ్‌తో సంయుక్తంగా 17వ ర్యాంక్‌కు దక్కించుకున్నాడు. రైనా నాలుగు స్థానాలు దాటి 31వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా బౌ లింగ్‌లో భారత ఆటగాళ్లెవరూ టాప్-10లో చోటు ద క్కించుకోలేదు. ఆల్‌రౌండర్ల జాబితాలో యువీ.. కలిస్ ను వెనెక్కి నెట్టి నాలుగో ర్యాంక్ కైవసం చేసుకున్నాడు.