ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
posted on May 9, 2023 @ 4:40PM
పాకిస్థాన్ తెహరీక్ -ఎ-ఇన్సాఫ్ అంటే పాకిస్థాన్ న్యాయపోరాటం అని అర్ధం. ఇలాంటి పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ప్రధాని పదవిని అధిష్టించిన ఇమ్రాన్ ఖాన్ ను అక్కడి ప్రభుత్వం రేంజర్లు అరెస్టు చేశారు. అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. ఆ పనిలో ఇస్లామాబాద్ హైకోర్టుకు బయో మెట్రిక్ గుర్తింపును పరిశీలించుకోవడానికి వచ్చిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్థానీ రేంజర్లు అదుపులోనికి తీసుకున్నారు.
ప్రధాని పదవి లోనుం స్వంత పార్టీ నేతలే ఇమ్రాన్ ఖాన్ ను పదవీచ్యుతుడిని చేశారు. అపంతనం వందకు పైగా కేసులను ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కోవలసి వచ్చింది. పాకిస్థాన్ జాతీయ జవాబుదారీ సంస్థ ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. గత ఏడాది ఏప్రియల్ లో అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవిని ఇమ్రాన్ ఖాన్ వదలాల్సి వచ్చింది. రష్యా , చైనా, ఆప్ఘనిస్థాన్ లపై ఇమ్రాన్ ఖాన్ అనుసరించిన విదేశాంగ విధానాల కారణంగా అవిశ్వాస పరీక్ష ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ విధానాలు నచ్చని అమెరికా తనపై కక్ష కట్టిందని ఇమ్రాన్ ఖాన్ వర్గం అప్పట్లో ఆరోపణలు చేసింది. రేంజర్లుగా అనుమానిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలు ధరించి ఇమ్రాన్ ఖాన్ ను అపహరించారని పీటీఐ అధికార ప్రతినిథి ఫహాద్ చౌదరి ఆరోపించారు.
ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే కోర్టులో హాజరు పారచాల్సిందిగా ఇంటీరియర్ సెక్రటరీని, ఐజీ పోలీసులను ఆదేశించాలని ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఫహాద్ కోరారు. 2003లో ప్రజాస్వామిక దేశంగా అవతరించిన పాకిస్థాన్ అంతకు ముందు ఐదున్నర దశాబ్దాల పైనిక పాలన వాసనలను ఇంకా మరచిపోకపోవడం విషాదం.