అసలు వాళ్లు టీచర్లేనా.. ఇదేంపని?
posted on Feb 22, 2023 6:56AM
విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు సన్మార్గంలో నడవడమెలాగో చెబుతూ ఆదర్శంగా ఉండాల్సిన గురువులే తప్పుదారిన నడిచారు. వివాహేతర సంబంధం పెట్టుకుని వృత్తికే తలవంపులు తెచ్చారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి బంధువుల చేతిలో దెబ్బలు తిని అవమానం పాలయ్యారు.
సభ్య సమాజం తలవంచుకునే ఈ ఘటన ములుగు జిల్లా మంగపేటలో వెలుగు చూసింది. మంగంపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న కుక్కల నాగేందర్, మరో మహిళా ఉపాధ్యాయురాలు కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఆ మహిళా ఉపాధ్యాయురాలి భర్త మహబూబాబాద్ లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అక్రమ సంబంధం విషయం తెలిసిన ఆమె భర్త గత ఏడాది డిసెంబర్ నెలలో పాఠశాలకు వచ్చి ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశాడు.
ఈ సందర్భంగా ఇద్దరినీ హెచ్చరించాడు. జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకూ ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆ మహిళా ఉపాధ్యాయురాలిని గత నెలలో మంగపేట నుండి కొత్త బెస్తగూడెం పాఠశాలకు డెప్యూటేషన్‌పై పంపారు. ఈ నేపథ్యంలోనే సెలవుపై మంగపేట వచ్చి ఆ మహిళా టీచర్ భర్తకు తన భార్య అక్రమ సంబంధాన్ని ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. వారిరువురూ కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బంధువులకు, స్థానిక ఉపాధ్యాయులకు సమాచారం అందించాడు. వివాహేతర సంబంధాన్ని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న సాంబయ్యతో పాటు బంధువులు వారిరువురికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.