ప్రపంచంలోనే పెద్ద విమానం హైదరాబాద్‌లోనే ఎందుకు దిగింది...?
posted on May 13, 2016 @ 9:51AM
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టింది. అంటనోవ్ ఏఎన్-225 మ్రియా విమానం ఆరు టర్బో ఫ్యాన్ ఇంజన్లు కలిగిన ఈ విమానం గరిష్టంగా 640 టన్నుల బరువును మోసుకెళ్లగలదు. ప్రస్తుతం నిర్వహణ సర్వీసులు అందిస్తున్న విమానాల్లోకెల్లా అతిపెద్ద రెక్కలు దీనికి ఉన్నాయి. చెక్ రిపబ్లిక్ నుంచి ఆస్ట్రేలియ వెళుతున్న ఈ విమానం విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చింది. శంషాబాద్‌లో ల్యాండ్ అవగానే అధికారులు నీళ్లు చల్లి సంప్రదాయ స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని పొడవైన రన్‌వే, విమానం ల్యాండింగ్‌కు అనుకూలమన్న భావనతోనే, ఈ విమానం ఇక్కడ ల్యాండయ్యింది. ఈ విమానం భారత్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఘనత దక్కించుకున్న తొలి విమానాశ్రయంగా ఆర్జీఐ రికార్డుల్లోకి ఎక్కింది.