హైదరాబాద్‌లో వర్షం..ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
posted on Jun 7, 2025 @ 4:26PM
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఖైరతాబాద్, ఆబిడ్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, యూసుఫ్‌గూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌లో వర్షం కురిసింది.
హైదరాబాద్‌తో పాటు నల్గొండ జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కాగా, ఇవాళ రాత్రి వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.