బంజారాహిల్స్ లో లవర్ సూసైడ్..
posted on Mar 30, 2021 @ 4:37PM
ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. చివరికి ఆ విషయం తెలిసిన పెద్దలు వాళ్ళని విడదీశారు.. అయినా అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు.. ఆ తరుణంలో ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని తన ప్రియుడు, ఆ ప్రియురాలికి మంగమ్మ శపథం చేశాడు..కాలం గడుస్తూ వచ్చింది.. పెళ్లి మాట పక్కన పెట్టాడు ఆ ప్రియుడు.. కొంత కాలం తర్వాత ఆ విషయం పై ప్రియుడిని నిలదీసింది.. ప్రియుడు పెళ్ళికి నిరాకరించాడు. ఆ విషయాన్నీ జీర్ణించుకోలేని ఆ అమ్మాయి హాస్టల్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సూర్యాపేటకు చెందిన ఐశ్వర్య (19) నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లోని ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటుంది. ఈ క్రమంలో మరెడ్డి అషేర్ (20) అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం ప్రేమ అనే గీత దాటి, వివాహం వరకు వెళ్లింది. గతంలో తమ పెద్దలకు తెలియకుండా వీరిద్దరూ ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి విషయం తెలుసుకున్న పెద్దలు.. వీరిని విడదీశారు. అయినప్పటికీ ఆ యువ జంట అప్పుడప్పుడూ కలుస్తుండేది. ఈ క్రమంలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్యను ప్రియుడు అషేర్ నమ్మిస్తూ వచ్చాడు. ఇలా కాలం పరుగులెత్తడంతో అషేర్‌ను ఐశ్వర్య నిలదీసింది. దీంతో ప్రియుడు మస్కా కొట్టాడు. దాంతో మనస్తాపం చెందిన యువతి తాను ఉంటున్నవసతి గృహంలో బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఐశ్వర్య కొన్ని సెల్ఫీ వీడియోలు తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.