పెళ్లి ఒకరితో.. గర్భం ప్రియుడితో..
posted on Mar 18, 2021 @ 10:07AM
ఒకరిని ప్రేమించింది. మరొకరిని పెళ్లి చేసుకుంది. అయినా ఆమె వక్ర బుడ్డి మానుకోలేదు. పెళ్లి తర్వత కూడా ప్రియుడితో టచ్ లో ఉంది. ఆ విషయం భర్తకు కూడా తెలుసు. తరుచు భర్త ను ప్రియుడితో పోల్చి అవమానించేది. అయినా ఆ భర్త ఓర్చుకున్నాడు. ఆ బాధని తనలోనే దాచుకున్నాడు. ఏ మగాడైనా బరించేంత వరకు భరిస్తాడు. అది అవమానంగా, ఆవేదన అయినా, కానీ తన ప్రియుడి వల్లే నేను గర్భం దాల్చను అని చెపితే ఒక భర్తకు అంత కంటే అవమానం ఏముంటుంది చెప్పండి.
ఎవరు ఎన్ని మాటలు అన్నా, తిట్టినా, అవమానించినా మగాళ్లు తట్టుకోగలరు. కానీ కట్టుకున్న భార్య నుంచే వేధింపులు మొదలైతే మాత్రం భర్త భరించలేడు. ప్రియుడి మోజులో పడి సూటి పోటు మాటలంటూ అవమానిస్తే తట్టుకోలేడు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. జగిత్యాల జిల్లా మల్యాలకుచెందిన అట్టపెల్లి రాజు అనే 30 ఏళ్ల యువకుడికి గొల్లపెల్లి మండలం బొంకూరుకు చెందిన ఓ యువతితో ఏడాది క్రితం పెళ్లయింది. అయితే పెళ్లికి ముందే ఆ యువతి గొల్లపెల్లి మండలంలోని తుంగూరుకు చెందిన సప్ప రాజేందర్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఏ కారణం వల్లనో ఏమో కానీ రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత కూడా ప్రియుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయం రాజుకు తెలిసి తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ భార్య తీరులో మార్పులేదు. అంతేకాకుండా ప్రతీ విషయంలోనూ భర్తను, ప్రియుడిని పోల్చుతూ కామెంట్స్ చేసేది. అవమానించేది. ఇదే క్రమంలో ఆమె ఇటీవల గర్భం దాల్చింది.
ఈ గర్భం వచ్చింది నీ వల్ల కాదు. దీనికి కారణం నువ్వు కాదు. నా ప్రియుడి వల్లే నేను గర్భవతిని అయ్యా‘ అంటూ భర్త రాజుతో తేల్చిచెప్పింది. ఆ తర్వాత తల్లిగారింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది. అంతటితో ఆగకుండా ఆ భార్య వేధింపులను మరింత పెంచింది. ఆమె తన ప్రియుడితో కలిసి రాజును మానసికంగా చిత్రహింసలకు గురిచేసింది. ’నీ బతుకు ఎందుకు. ఎందులోనైనా దూకి చచ్చిపోరాదు. నీదీ ఒక బతుకేనా?’ అంటూ ఫోన్లు చేసి వేధించసాగారు. దీంతో మనో వేధనకు గురైన ఆ భర్త మంగళవారం మల్యాల మండలం నూకపెల్లి శివారులోని వరద కాలువ క్రాస్ రెగ్యులేటర్ గేట్ల వద్ద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య, ఆమె ప్రియుడి గురించి వివరాలు ఆరా తీస్తున్నారు.