కోర్టులో తప్పు అంగీకరించాడు... బయటకి వచ్చి తల నరికేడు!
posted on Aug 18, 2022 @ 12:16PM
కర్ణాటక, హసన్ జిల్లా. చిత్ర అనే ఆమె వాష్‌రూమ్‌కి వెళుతోంది. వెనగ్గా భర్త వచ్చి కొడవలితో మెడ నరికి చంపేశాడు. ఇదేదో క్రైం సినిమాలో సీన్ కాదు. నూటికి నూరుపాళ్లూ వాస్తవం. అప్పటిదాకా అక్కడివారు వాళ్లను గొడవలు మర్చిపోయి, కొత్త జీవితాన్ని గడిపేవారిగానే భావించారు. హమ్మయ్యా వారిద్దరూ కలి సేరు అనుకున్నారు రెండు కుటుంబాలవారూ, చిత్ర బంధువులు, కోర్టులో కోర్టు సీన్ చూసినవారు. కానీ ఆ ఆనందం ఆమెకు తాత్కాలికమైంది. ఆ క్షణం ఆమెకు ఆఖరిక్షణంగా మారు తుందని ఊహించలేదు. అప్పుడు కాస్తంత నవ్వి, తన తప్పు తెలుసు కున్నానన్న భర్త నటిస్తున్నాడని ఆమె అస్సలు గ్రహించ లేదు. కానీ శివకుమార్ మొగుడు, దుర్మా ర్గుడు.. వాష్‌రూమ్ వరకూ వెంట వెళుతున్నాడనే అనుకున్నారంతా.. అంతలోనే అంతా అయి పోయింది.
గొడవలు, మనస్పర్థలు భార్యాభర్తల మధ్య సహజం. ఒక్కోసారి ఇవి గోరంత నుంచి కొండంతకు వెళ్లి దారు ణాలకు దారి తీస్తుంటాయి. పోలీసులు, కోర్టుల జోక్యంతో భార్యాభర్తల మధ్య ఉండే విబేధాలు కొంతవరకు తగ్గొచ్చు. ఫ్యామిలీ కోర్టుకి చేరుకున్న కేసును సాధ్యమైంతవరకూ శిక్షవేయకుండా వారిద్దరినీ కలపడానికే చూస్తుంది కోర్టు. ఏదో కొన్ని సందర్భాల్లోనే తప్పనిస్థితిలో ఎవరో ఒకరికి శిక్ష వేయడం తప్పనిసరే అవుతోంది. ముందు అన్నింటికి అంగీకరించి ఆనక అత్తింటి ఆరళ్లు కొనసాగడం ఏ మహిళ కయినా దుర దృ ష్టమే. నాలుగ్గోడల మధ్య జరిగే హింసను కోర్టుకు ఈడ్చిందన్న ఆగ్రహం రెట్టించడమూ జరుగుతోంది. ఇలా చాలామంది సమస్యలు తీవ్రతరమై ఆత్మహత్యలూ చేసుకుం టున్నారు.
కానీ కర్ణాటక హస్సన్ జిల్లా ఫ్యామిలీ కోర్టుకు వచ్చిన శివకుమార్, చిత్ర కేసు ఊహించనివిధంగా ఒక కొలిక్కి వచ్చింది. ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం నుంచి వారి మధ్య విభేదాలు తారస్థాయికి చేరు కుని ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు. విడిపోవాలనే నిర్ణయించుకున్నారు. విడాకులే కావాలన్నారు. కానీ కోర్టువారు మాత్రం ఇద్దరికీ నచ్చజెప్పి ప్రశాంతంగా కాపురం చేసుకోవాలని సూచించారు. కోర్టు చెప్పిన మాటలు విన్నారు, తమ తప్పు తెలుసుకున్నట్టే కనిపించారు. ఇక నుంచీ కలిసే ఉంటా మన్నారు. శివ కుమార్ తన తప్పును తెలుసుకున్నాను, ఇక నుంచి చక్కగా కాపురం చేసుకుం టాననే అన్నాడు. అంత టితో కేసు ముగిసిపోయింది. ఇద్దరూ కోర్టు హాలు నుంచి బయటికి వచ్చారు. ఊహిం చని ట్విస్ట్ ఇక్కడ జరిగింది.
చిత్ర వాష్ రూంకి వెళ్తుండగా ఆమె వెనకాలే వెళ్లి కొడవలితో ఆమె గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులకు చిక్కాడు. రక్తపు మడుగులో ఉన్న చిత్ర ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయమై హస్సన్ జిల్లా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ ‘‘కోర్టు పరిధిలోనే ఈ దారుణం జరిగింది. నిందితుడు మా కస్టడీలోనే ఉన్నాడు. దాడికి ఉపయోగించిన కొడవలిని సీజ్ చేశాం. ఈ కేసుపై తదుపరి విచారణ చేస్తున్నామని తెలి పారు.