భార్య ను బలికొన్న అనుమానం..
posted on May 5, 2021 6:55AM
అనుమానం. ఇది ఒక పెద్ద పెనుభూతం. ఒక్క సారి మనిషిలో అనుమానం అనే సందేహం మొదలైతే, పక్క వాళ్ళ అంతు చూసే వరకు నిద్దరపోదు. ఈ అనుమానం తో క్షణికావేశంలో ఎన్నో ఘోరాలు జరిగాయి.. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భర్త అనుమానం భార్య ప్రాణాలు తీసింది. ఎందుకు? ఎక్కడ ? ఎలా ? అని ఆలోచిస్తున్నారా? చదవండి మీకే తెలిసింది.
అది పటాన్‌చెరు. రుద్రారం గ్రామం. అతని పేరు సురేష్. ఆమె పేరు స్వప్న. వాళ్ళిద్దరికి పెళ్లి అయింది. పిల్లలు కూడా ఉన్నారు. కొంత కాలం బాగానే ఉన్నారు. అయితే సురేష్ భార్య తను ఇంట్లో లేనప్పుడు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుంది. అలా కొన్నిరోజులు ఆ వ్యవహారం కొనసాగింది. ఈ నేపధ్యం లో సురేష్ భార్య స్వప్నపై అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి సురేష్ ఇంటికి వచ్చేసరికి భార్య స్వప్న ఫోన్‌లో మాట్లాడుతోంది. దీంతో అనుమానం పెంచుకున్న అతడు భార్యను తీవ్రంగా కొట్టిగాయపరిచాడు. గాయపడిన స్వప్న అపస్మారక స్థితి చేరుకుంది. ఆమెను ఇస్నాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కానిస్టేబుల్ ఉరి..
అది దుండిగల్. వంగర మండలం. గీతనాపల్లి గ్రామం. అతని పేరు కె.రమణమూర్తి. ఆయన భార్య పేరు శారద. ఉద్యోగరీత్యా హైదరాబాద్ కి వచ్చారు. సూరారంలోని పాండు బస్తీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. గత 7 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు రమణమూర్తి. అతను తరచూ మద్యం తాగుతుండడంతో దంపతుల మధ్య కలహాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఇటీవల తన సోదరుడి ఇంటికి శారద ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్లింది. రమణమూర్తి డ్యూటీ కి వెళ్లకుండా మత్తులో మునిగి తేలుతున్నాడు.
కట్ చేస్తే.. ఈ నెల 1న శారదా కు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో కానిస్టేబుల్ కృష్ణ, రమణమూర్తి విధులకు హాజరవడం లేదని చెప్పాడు. దీంతో ఆమె తన బంధువులకు ఈ విషయం చెప్పింది. శారదా బంధువులు అదే రోజు ఇంటికి వెళ్లి చూడగా రమణమూర్తి ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసుల అక్కడికి వెళ్లారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పోలీసుల కధనం ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గొంతు కోసుకున్న మరో కానిస్టేబుల్..
ఆర్థిక ఇబ్బందులు.. మానసిక వ్యథతో ఓ కానిస్టేబుల్ గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మలక్‌పేట పోలీస్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ముసారాంబాగ్ డివిజన్ సలీంనగర్ పరిధి బాలదానమ్మ బస్తీలో నివసించే అభిలాష్ నాయక్(33) కానిస్టేబుల్. 2011లోనే తన మేనమామ కుమార్తె ఇంద్రజ్యోతితో వివాహమైంది. వీరికి ధీరజ్, హేమంత్ అనే కుమారులు ఉన్నారు. ఆరేళ్లుగా మాదన్నపేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అభిలాష్.. భారీగా అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావటంతో మానసిక వేదనకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం భార్య, పిల్లలను కోదాడలోని పుట్టింట్లో వదిలి వచ్చాడు. సోమమధ్యాహ్నం భోం చేసి రెండో అంతస్తులోని గదిలో పడుకుంటానని తల్లితో చెప్పి వెళ్లాడు. తర్వాత కిందికి రాలేదు. రాత్రి పదింటికి సోదరుడు ప్రభు వెళ్లి చూడగా గది తలుపు మూసి ఉంది. ఎంతకు సమాధానం రాకపోవడంతో స్థానిక యువకుడు అశోక్‌తో కలిసి తలుపు బద్ధలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా అభిలాష్ రక్తపుమడుగులో మంచం కింద విగతజీవిగా పడి ఉన్నాడు. అప్పటికే మరణించడంతో పోలీసులకు సమాచారం అందించారు. తొలుత బ్లేడుతో ఎడమ చేయి మణికట్టు, తర్వాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.