నాలుగు నెలల పెళ్లి.. ఆ తర్వాత పెళ్ళాం బలి..
posted on May 6, 2021 @ 10:04AM
పెళ్లి ఒక ఆడ, మగ. మూడు ముళ్ళు. ఏడు అడుగులు. పంచభూతాలు. వేదమంత్రాలు పెద్దల ఆశీర్వాదాలు. పచ్చని పందిరి. ఒక పెళ్లి జరగాలంటే ఇంత తతంగం ఉంటుంది. ఏ అమ్మాయి అయినా తన భర్త బాగుండాలి, తనని బాగాచూసుకోవాలి అని కలలు కంటుంది. అలాంటి భర్త దొరికితే ఏ అమ్మాయి కైనా అంతకంటే ఎక్కువ ఏం కావాలనుకోదు. కానీ ఒక వేల సీన్ రివర్స్ అయిందనుకో ఇక ఆ అమ్మాయి జీవితం నరకం కంటే దారుణంగా ఉంటుంది.. జీవితం అంత కష్టాల కొలిమిలో కాలిపోవాల్సిందే.. తన ఆశలు పెళ్లి ఆహుతులో కలిసిపోవాల్సిందే. పెళ్ళికి ముందు బాగుండి. మూడు ముళ్ళు, ఏడు అడుగులు నడిచిన కొద్దిరోజులకే కొత్త మంది భర్తల నిజస్వరూపం బయట పడుతుంది. తన భర్త రాముడు కాదు, రావణాసురుడు అని తెలుస్తుంది. ఇక పెళ్లి కూతురు పని స్వాహా..ఆ అమ్మాయి కలలు గాల్లో కలిసిపోతాయి. కలిసి జీవితాంతం బతుకుదాం అనుకున్న ఆమె మనసులో ఆవేదన అంత అంత కాదు. ఇంతకి ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా.. మీరు చదవపోయేదానికి సంబంధం ఉంది మేరే చూడండి..
అది విజయవాడ. పాయకాపురం. అతని పేరు దుర్గారావు. ఆమె పేరు నీరాజ. వారిద్దరికీ నాలుగు నెలల కింద పెళ్లి అయింది. పసుపుతాడు ఎండలేదు. పెళ్లి పందిరి తియ్యలేదు. రెండు మూడు నెలలు సంతోషంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా జపాన్ నాగసాకి మీద బాంబు పడ్డట్లు.. ఆ ఇంట్లో గొడవలు. ఆ గొడవలు ఆమె నిండు నూరేళ్ళకు శుభం కార్డు పడింది. ఇంతకి ఆ గొడవలు ఏంటనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం..
దుర్గా రావు తన భార్యని మూడు వేలు అడిగాడు. ఆమె కరోనా టైం కదా..? చేతిలో ఉన్న డబ్బులు అయిపోతే , మళ్ళీ తమ ఇంటి అవసరానికి డబ్బులు దొరకవు అనుకుందో ఏమో.. భర్త అడిగిన డబ్బులు ఇవ్వలేదు. తను ఆర్ధిక భవిష్యత్తు గురించి ఆలోచింది కానీ .. ఆ డబ్బులు ఇవ్వకపోతే భర్త చేతిలో మరణాన్ని గుర్తించలేదు. మూడు వేయిల గొడవ ముదిరి ముదిరి చివరికి ఆ భర్త తన భర్య ప్రాణాలు తీశాడు. ఆ నీచుడు. ఒక్కసరిగా కత్తి తీసుకుని దాడి చేసి హత్య చేశాడు. అంతే ఒక నిండు ప్రాణం వెళ్లిపోయింది. ఆమె కలలు, ఆశలు, కష్టాలు, సుఖాలు కత్తి కి బలైపోయాయి. చివరికి ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పెండ్లి చేసినా నాలుగు నెలలకే కూతురు శవంగా మారడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.