ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య..
posted on May 2, 2021 @ 2:58PM
ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య, అవును. ఇది తెలుగులో వచ్చిన సినిమానే.. కానీ ఈ వార్తలో ఆ కథకి అసలు సంబంధం లేదు. ఈ కథ నెక్స్ట్ లెవల్ ఉంటది. అది ఏంటి అనేది మీరే చదవండి. అతని పేరు ఉమామహేశ్వరావు. అతను ఒక ఉపాద్యాయుడు. ఉపాధ్యాయుడంటే ఉత్తముడు అనే రోజులు ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఉపాధ్యాయులు జల్సాలో మునిగితేలుతున్నారు. దండాలు చేస్తున్నారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన పంతులు సొంత కుటుంబ సభ్యులతో గొడవలు పడుతున్నారు. చాక్ పీస్, బెత్తం పట్టుకోవాల్సిన చేతితో కత్తి పట్టుకున్నాడు.. కత్తి పట్టుకున్నాడు ఓకే ఏ ఉల్లిపాయలు, ఏదైనా కూరగాయలు కొయ్యడానికో అయితే బాగుండేది. కానీ కోపం తో రగిలి పోయిన ఈ పంతులు ఏకంగా తన భార్య గొంత కోశాడు. ఎందుకు తన భార్య గొంతు కోశాడు అనుకుంటున్నారా..? అయితే సెకండ్ పేరా చదవాల్సింది.
ఓపెన్ చేస్తే.. ఉమామహేశ్వరావు విడాకుల విషయంలో భార్యాభర్తల నడుమ ఏర్పడిన వివాదం జరిగేది. గుంటూరుకు చెందిన ఉమామహేశ్వరరావు నరసరావుపేట మండలంలోని యలమంద ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయనకు భార్య విజయకుమారితో కుటుంబ కలహాలుండడంతో వారు విడివిడిగా నివాసం ఉంటున్నారు. పొన్నూరులో నివాసం ఉంటున్న విజయకుమారి తనను వేధిస్తున్నారంటూ భర్త, అతని కుటుంబ సభ్యులపై గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు.
కట్ చేస్తే.. ఉమామహేశ్వరరావు శనివారం పొన్నూరు వచ్చి విడాకులు ఇవ్వాలంటూ భార్యతో వాదనకు దిగాడు. ఆమె ఒప్పుకోలేదు. ఆ విషయం అతనికి నచ్చలేదు. ఉమామహేశ్వరావు ఒక సారిగా ఉగ్రరూపం దాల్చాడు. తన పధకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో తన భార్య మీద విరుచుకు పడ్డాడు. ఒక్క సారిగా ఆమె గొంతు కోశాడు. స్థానికులు స్పందించి వెంటనే ఆమెను పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏఎస్‌ఐ సుభానీ ఆమె వాగ్మూలం నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.