భారీగా బకాయిలు.. స్నోవరల్డ్ సీజ్
posted on Sep 2, 2022 @ 11:20AM
పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు అంతే ముఖ్యం. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో పిల్లలకు కాస్తంత సరదాగా సెలవు రోజుల్లో గడపాలనుకుంటారు. అందుకు నగరంలోని లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలో ఉన్న స్నోవరల్డ్ ఎంతో ఆకట్టుకుంటోంది. పిల్లలతో పాటు పెద్దవాళ్లూ కొంత సేపు సరదాగా గడపడానికి స్నోవరల్డ్‌ను ఎంచుకుంటున్నారు. మంచు థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ పర్యాటక ప్రదేశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు సందర్శిస్తుం టారు. కానీ హఠాత్తుగా పర్యాటక శాఖ అధికారులు ఈ సీజన్‌కు మూసివేశారు.
లీజు బకాయిలు చెల్లించలేదన్న కారణంతోనే సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. బకాయిల విష యంలో చాలాసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్నోవరల్డ్ యాజమాన్యం స్పందించడం లేదు. స్నో వర్డ్ యాజమాన్యం రూ. 16 కోట్లుకు పైగా బకాయిలు ఉన్నట్లు టూరిజం శాఖ అధికారులు తెలిపారు.
కోర్టు ఆదేశాల ప్రకారం లీజు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లింపులో నిర్లక్ష్యం చేయడంతో తెలంగాణా రాష్ట్ర పర్యాటకశాఖ నోటీసులకు స్పందించకపోవడంతోనే స్నోవరల్డ్, ప్రాంగణంలో ఉన్న దుకాణాలను సీజ్ చేశారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారు. కాగా, స్నోవరల్డ్ వద్ద పర్యాటకశాఖ సెక్యూ రిటీ సిబ్బందిని ఏర్పా టు చేసింది. మరి యాజమాన్యం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుం టుందో చూడాలి.