గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా? ఇలా వదిలించుకోండి..!
posted on Dec 10, 2024 @ 9:30AM
చాలామందికి ఆహారం, అలవాట్ల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి ఈ సమస్య వంశపార్యపరంగా కూడా వస్తుంది. అయితే ఈ మద్యకాలంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్య అధికంగా మారింది. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గాల్ బ్లాడర్ స్టోన్స్ ను తెలుగులో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడ్డాయని చెబుతారు. పిత్తాశయం లివర్ కు కొంచెం దిగువ భాగంలో ఉంటుంది. చాలా వరకు ఆపరేషన్ చేసి పిత్తాశయాన్ని తొలగిస్తుంటారు. దీని వల్ల వచ్చే సమస్య ఏమీ లేదని కూడా అంటారు. కానీ పిత్తాశయాన్ని తొలగించకుండా పిత్తాశయంలో రాళ్లు తొలగించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే..
యాపిల్ సైడర్ వెనిగర్..
వెనిగర్ గురించి చాలామంది వినే ఉంటారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆరోగ్య స్పృహ ఎక్కువ ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ ను నీళ్లలో మిక్స్ చేసుకుని తాగుతుంటారు. దీన్ని తాగడం వల్ల పిత్తాశయం రాళ్ల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఈ రాళ్లను కరిగించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
పియర్..
పియర్ పండ్లలో పెక్టిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది. పియర్ పండ్లు అందుబాటులో ఉన్నప్పుడు వీటిని తప్పనిసరిగా తినాలి. ఇది మధుమేహ రోగులకు కూడా చాలా మంచిది.
జ్యూస్..
జ్యూస్ లు శరీరాన్ని శుద్ది చేయడంలో, శరీరంలో టాక్సన్లు బయటకు పంపడంలో సహాయపడతాయి. బిట్ రూట్, క్యారెట్, కీర దోసకాయ.. ఈ మూడు కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగాలి, ఇది సులభంగా జీర్ణం అవుతుంది. గాల్ బ్లాడర్ లో రాళ్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
తంగేడు..
తంగేడు ఆకులు పల్లె ప్రాంతాలలో విరివిగా లభిస్తాయి. ఈ తంగేడు ఆకులను కూడా పిత్తాశయం రాళ్లు వదిలించుకోవడంలో ఉపయోగించవచ్చు. ఇందుకోసం తంగేడు ఆకులను తేనెతో కలిపి తీసుకోవాలి. దీని వల్ల రాళ్ల నొప్పి కూడా తగ్గిపోతుంది.
పుదీనా..
పుదీనా రాళ్లను తగ్గించడంలో సహాయపుడుతుంది. కేవలం గాల్ బ్లాడర్ సమస్యకే కాదు.. కిడ్నీ రాళ్లకు కూడా ఇది సహాయపడుతుంది. పుదీనాలో టెర్పెన్ అనే మూలకం ఉంటుంది. ఇది రాళ్లను నెమ్మదిగా తొలగిస్తుంది. పుదీనాను వీలైనంత ఆహారంలో తీసుకోవాలి. పుదీనా జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్-సి..
విటమిన్-సి పుష్కలంగా తీసుకోవాలి. ఎరుపు రంగు క్యాప్సికం లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది.
తృణధాన్యాలు..
ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు తినడం వల్ల గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య, దాని ప్రమాదం కూడా దూరం అవుతుంది.
పసుపు..
పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఉంటాయి. పసుపు తినడం వల్ల పిత్తాశయం రాళ్లు క్రమంగా విరిగిపోయి అవి బయటకు వచ్చేస్తాయి.
*రూపశ్రీ.