డయాబెటీస్‌కు పెరటి వైద్యం
posted on Sep 9, 2024 @ 9:30AM
డయాబెటిస్ సమస్య చాలా పెద్దసమస్య ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి చక్కర వ్యాధి సమస్యతో బాధపడుతూనే ఉంటారు.అయితే ఇది మీకు తెలుసా డయాబెటీస్ కు పెరటి వైద్యం తోనియంత్రించ వచ్చు. మన ఇంట్లో లభించే గృహవైద్యం తో అంటే మీ పెరట్లో మీ ఇంటి సమీపం లో లభించే మామిడి ఆకులకషాయం,తులసి ఆకులు తీసుకుంటే డయాబెటీస్ ను నియంత్రించ వచ్చని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా మామిడి చెట్లు మీఇంటికి సమీపంలో లేదా మీపెరట్లో పెంచుకుంటూ ఉంటారు.అలాగే మీ పెరట్లో అత్యంత పవిత్రంగా భావించే తులసి చెట్టును చాలా భక్తి శ్రద్ధలతో మహిళలు పెంచుకుంటూ ఉంటారు.అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే వాస్తవానికి మామిడి ఆకుల కషాయం, తీసుకుంటే డయాబెటీస్ ను నియంత్రించవచ్చని నిపుణులు అంటునారు. మామిడి ఆకుల్లో ఎంతో సయిడిన్ పేరుతో టైనిన్ అనే పదార్ధం ఉంటుంది.డయాబెటీస్ చికిత్సకు ఇది సహాయ పడుతుంది. మామిడి ఆకులు ఇన్సూలిన్ ను ఉత్పత్తి చేస్తాయి గ్లూకోజ్ ను పంచడం ఇన్సూలిన్ ను సరిగా పనిచేయించడం లో మామిడి ఆకులు ఉపయోగ పడతాయి.
మామిడి ఆకులను ఎలా వాడాలి...
బ్లడ్ షుగర్ నివారించాలంటే 1౦ నుండి 15 మామిడి ఆకులు తీసుకోండి.ఒక గిన్నెలో నీటిని పోసి బాగా మరిగించండి.మరిగించిన రాత్రి నీటిలో ఆకులను వేయండి. నాన పెట్టిన ఆకుల రసాన్ని మర్నాడు ఉదయం పరగడుపున నీటిని వడకట్టి తాగండి నియమిత పద్దతిలో నీటిని సేవిస్తే బ్లడ్ షుగర్ నియంత్రించ వచ్చు.
తులసి ఆకులతో డయాబెటీస్ ను నియంత్రణ...
తులసి ఆకుల ప్రభావం సత్వరం ఉంటుంది.మీరు డయాబెటీస్ ను నియంత్రించ వచ్చు.మీరు డయాబెటిస్ తో సతమత మౌతుంటేమనకు అందుబాటులో ఉన్న పెరటి వైద్యం లేదా హెర్బల్ వైద్యం అందించడం ద్వారా మీ డయాబెటిస్ ను నియంత్రించవచ్చు.
ప్రాధాన అంశాలు...
తులసి ఆకులను తీసుకోవడం ద్వారా డయాబెటీస్ నియంత్రించ వచ్చు.ఉదయానే పరగడుపున తులసి ఆకులను తినడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయని హెర్బల్ వైద్యులు పేర్కొన్నారు.
మీ పెరట్లో మీకు అందుబాటులో ఉన్నవాటితో చికిత్స...
డయాబెటీస్ తీవ్రమైన సమస్య దీనిని అంత సులభంగా తీసుకుని అంటే సామాన్యుడి పరిభాష లో లైట్ తీసుకోకండి.తప్పు చేయకండి.ఎవరైతే డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారో దానితో సహజీవనం సాగిస్తున్నారో.డయాబెటీస్ కు చికిత్స లేదని అంటున్నారు.దీనిని పూర్తిగా నివారించాలేము.అయితే పైన పేర్కొన్న ప్రాత్యామ్నాయ విధానాలనుఅనుసరించడం ద్వారా డయాబెటిస్ ను నియంత్రించ వచ్చు.అందుకోసం మీరు తీసుకునే ఆహారం విషయం లో కాస్త శ్రద్ధ అవసరం. ఇంట్లో మీకు అందు బాటులో ఉండేఔషద మొక్కలను వినియోగించడం ద్వారా డయాబెటీస్ ను నివారించవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో లభ్యమయ్యే తులసి ఆకుల ను తీసుకోవడం ద్వారా
డయాబెటీస్ ను నియంత్రించ వచ్చు.
ఆధ్యాత్మిక పరంగా తులసి చెట్టును చాలా పవిత్రం గా భావిస్తారు.ఇంట్లో ఉండే కుండీలలో తప్పనిసరిగా పెంచుతారు.అలాగే ప్రతిరోజూ తులసి కోటకు పూజ చేసి దీపం పెట్టనిదే ఉదయం స్త్రీల కార్యక్రమాలు ప్రారంభం కావు.ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంచుకోవడం శుభంగా భావిస్తారు.తులసి చెట్టు యొక్క ప్రాధాన్యత వాటి మహాత్మ్యం గురించి మీకు తెలుసా. అలాగే తులసి లో ఉన్న ఔషద గుణాలు ఉన్న మొక్కగా భావిస్తారు.మీకు ఎటువంటి భయంకరమైన అనారోగ్య సమస్య ఉన్న పోరాడ వచ్చు.తులసిలో యాంటి బాయిటిక్ ప్రాపర్టీ ఉటుంది.
ముఖ్యంగా ఉదర సంబందిత సమస్యలకు సంబందించిన తులసి లో పోరాడే తత్వం ఉందని నిపుణులు పేర్కొన్నారు. తులసితో పలు అనారోగ్య సమస్యలు పంచేంద్రియాల లో సమస్యలు,కడుపులో మంట,పి సి ఓడి వంటి సమస్యలు తగ్గించడం లో తులసి సహకరిస్తుంది.దీంతో పాటు మరికొన్ని ఔషద తత్వాలు లభిస్తాయి.ముఖ్యంగా ప్యాంక్రి యాటిక్ బీటా సేల్స్,ఇన్సూలిన్ ప్రక్రియ ప్రారంభ మౌతుంది.ఉదయం లేవగానే పరగడుపున తులసి ఆకులు నమలండి.లేదంటే తులసి ఆకుల రసం కూడా తాగవచ్చు. అలా చేయడం ద్వారా బ్లడ్ షుగర్ స్థాయి తగ్గుతుంది.
ఉదయం పరగడుపున తులసి ఆకులు తినడం వల్ల లాభాలు...
*ఇమ్యునిటి పెరుగుతుంది.
*గుండెకు లాభం.
*పంచేంద్రియాలకు లాభం.
*జలుబును నివారించడం లో దోహదం చేస్తుంది.
*క్యాన్సర్ ను నివారించేందుకు తులసి సహకరిస్తుంది.
*జలుబు దగ్గుకు ఉపయోగం. దయాబిటిస్ నియంత్రించడం లో మామిడి ఆకుల రసం,తులసి ఆకులు దోహదం చేస్తాయని అనడం లో సందేహం లేదు.