ఈ ఇంటి చిట్కా ఫాలో అయితే చాలు.. మోకాళ్ల నొప్పి మాయం కావడమే కాదు.. చకచకా నడిచేస్తారు!
posted on Jul 10, 2025 @ 9:30AM
మోకాళ్ల నొప్పులు ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తాయి. దీని కారణంగా, లేవడం, కూర్చోవడం, నడవడం నుండి రోజువారీ పనులు చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్లలో నిరంతరం నొప్పితో బాధపడే వారు ఈ సమస్యకు సర్జరీ లేదా చాలా తీవ్రమైన చికిత్సలతో తప్ప నయం కాదని అనుకుంటూ ఉంటారు. అయితే ఇంటి చిట్కాతో మోకాళ్ల నొప్పిని ఈజీగా తగ్గించవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ చిట్కా వల్ల మోకాళ్ల నొప్పి తగ్గడమే కాదు.. హాయిగా చకచకా తిరిగేసేంత శక్తి మోకాళ్లకు వస్తుంది అంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో తెలుసుకుంటే..
మోకాళ్లలో వాపు, మోకాళ్లు బిగుసుకుపోయినట్టు ఉండటం, నొప్పి ఎక్కువగా ఉండటం వంటి సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక పురాతన పేస్ట్ ఉంది. దానిని మోకాలి నొప్పి ఉన్న ప్రాంతంపై పూసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత చాలా ఉపశమనం కలుగుతుందట. ఈ ఆయుర్వేద పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..
పేస్ట్ తయారీ విధానం..
మోకాలి నొప్పి నుండి సహజ ఉపశమనం పొందడానికి, ఆయుర్వేద పేస్ట్‌ను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం కావలసిన పదార్థాలు..
1 టీస్పూన్ ఆముదం
1 టీస్పూన్ తేనె
1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి
1 నిమ్మకాయ.
తయారు విధానం..
ఒక గిన్నెలో అన్ని పదార్థాలను బాగా కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా గట్టిగా లేదా చాలా పలుచగా ఉండకూడదు. మధ్యస్థంగా మోకాలి మీద రాసినప్పుడు కారిపోకుండా లేదా తొందరగా ఆరిపోయి రాలిపోకుండా ఉండాలి. ఈ పేస్ట్ ను చాలా సులభంగా అప్లై చేయవచ్చు.
తయారు చేసుకున్న ఆయుర్వేద పేస్ట్ ను పలుచని పొరలాగా మోకాలిపై నొప్పి ఉన్న ప్రాతంలో లేదా మోకాలు అంతటగా పూయాలి. దానిపై మెత్తని కాటన్ వస్త్రాన్ని చుట్టాలి. 8-10 గంటలు అలాగే ఉంచాలి. దీన్ని రాత్రి సమయంలో అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఉదయం గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి.
ప్రయోజనాలు..
ఈ పేస్ట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
దీన్ని పూయడం వల్ల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇది మోకాలు బిగుసుకుపోవడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..