చట్టానికి పేర్లు లేవు

 

కేంద్రమంత్రి శశి ధరూర్ డిల్లీ అత్యాచార బాధితురాలి పేరుని ఎందుకు బహిర్గతం చేయకూడదని తన ట్వీట్టర్ మెసేజ్ లో ప్రశ్నించదమేగాకుండా, ఆ అమ్మాయి కుటుంభానికి అభ్యంతరం లేనట్లయితే ఆమె వీరోచిత పోరాటానికి చిహ్నంగా త్వరలో సవరించబోతున్న చట్టానికి ఆమెపేరునే పెడితే బాగుంటుందని కూడా ఒక సలహా వ్రాసి ప్రజలనుండి కొంత మద్దతును మరికొంత వ్యతిరేఖతను కూడా పొందారు. అయితే, అనూహ్యంగా ఆమె కుటుంబసభ్యులు సానుకూలంగా స్పందిస్తూ సవరణలు పొందుతున్న చట్టానికి తమ కుమార్తె పేరు పెడితే తమకేమి అభ్యంతరంలేదని ఈరోజు డిల్లీలో ప్రకటించేరు. వారి స్పందనచూసి కొందరు ప్రజలు కూడా ఆవిధంగా చేసినట్లయితే ఆమెకు సముచిత గౌరవం ఇచ్చినట్లు ఉంటుందని అభిప్రాయపడ్డారు.

 

హోం మంత్రిత్వశాఖ వెంటనే స్పందిస్తూ భాదితురాలు తన వీరోచిత పోరాటంతో చట్టంలో పెను మార్పులకు దోహదపడినప్పటికీ, భారతీయ శిక్షాస్మృతిలో చట్టాలకు వ్యక్తులపేర్లు పెట్టె అవకాశం లేదని, రాజ్యాంగం అందుకు అనుమతించదని పేర్కొన్నారు.