ట్రంప్ గెలవాలంటూ ఇండియాలో పూజలు...!
posted on May 15, 2016 @ 10:04AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ గెలవాలని సొంత దేశం అమెరికాలో చాలా మంది కోరుకుంటున్నారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు కాని నోరు తెరిస్తే భారత్‌పై విషం కక్కే ట్రంప్ గెలివాలని భారతీయులు కోరుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే భారత్‌లోని హిందూసేన..డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని యజ్ఞమే నిర్వహించింది. యజ్ఞంలో భాగంగా దేవతల ప్రీత్యర్థం నవధాన్యాలు, నెయ్యి హోమగుండంలో వేశారు. హిందూ దేవతల బొమ్మలతో పాటు తిలక ధారణం చేసిన ట్రంప్ ఫోటోలను కూడా అక్కడ పెట్టారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించగలగిన వాడు ఒక్క ట్రంప్ మాత్రమేనని హిందూసేన ఆకాంక్షిస్తోంది. భారత్ కూడా ఇస్లామిక్ చాందసవాదం బెడదను ఎదుర్కొంటున్నదే కాబట్టి, ట్రంప్ గెలిస్తేనే ఆ బెడద వదులుతుందని హిందూసేన వ్యవస్థాపకుడు విష్ణుగుప్తా విలేకరులకి చెప్పారు.