అప్పుడు ట్రంప్.. ఇప్పుడు హిల్లరీ..
posted on Oct 19, 2016 @ 4:04PM
గతంలో అమెరికా అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ నగ్నవిగ్రహాన్ని న్యూయార్క్ వీధుల్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిల్లరీ విగ్రహాన్ని కూడా పెట్టారు. మాన్‌హటన్‌లోని సబ్‌వే స్టేషన్ బయట హిల్లరీ టాప్‌లెస్ విగ్రహాన్ని ఎవరో ఉంచారు. దీంతో ఈ నగ్న విగ్రహం వివాదానికి కారణమైంది. దీనిని చూడగానే ఓ మహిళ దానిని కింద పడేసి.. ఇలా చేయడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మళ్లీ ఎవరూ దానిని అక్కడ పెట్టకుండా దానిపై ఎక్కి కూర్చుంది. అయితే అప్పుడు ట్రంప్ విగ్రహాన్ని తామే తయారుచేసినట్లు ఇన్‌డిక్లైన్ సంస్థ ప్రకటించింగా.. ఇప్పుడు మాత్రం హిల్లరీ విగ్రహంతో మాత్రం తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. ట్రంప్ విగ్రహం పెట్టినప్పుడు ఎలాంటి వివాదం జరగలేదు కానీ...హిల్లరీ విషయంలో మాత్రం అది వివాదానికి దారితీసింది. దీంతో పోలీసులు కూడా విగ్రహాన్ని వెంటనే అక్కడి నుంచి తొలగించేశారు. అయితే విగ్రహాన్ని పెట్టింది ఎవరనేది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు.