మళ్లీ ప్రచారంలో హిల్లరీ... వెనక్కి తగ్గేది లేదు..
posted on Sep 16, 2016 @ 12:50PM
కాస్త అస్వస్థకు గురైన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మళ్లీ ప్రచారంలో పాల్గొన్నారు. ఇటీవల ఓ నివాళి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె న్యూమోనియా వల్ల అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల బ్రేక్ తర్వాత ఆమె ఇప్పుడు మళ్లీ నార్త్ కరోలినాలో ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితిలోనూ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వెనుదిరిగేది లేదని.. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది, ఈ దశలో ఇంట్లో కూర్చోవడం కరక్ట్ కాదని ఆమె అన్నారు. నాపై అన్ని రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి, అది మీకూ తెలుసు. రేసు నుంచి తప్పుకోవాలని ఎవరూ అనడంలేదు, అయినా నేను తప్పుకోను, ఎట్టిపరిస్థిల్లో వెనుదిరిగేది లేదని ఆమె అన్నారు. కాగా నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.