విమాన ప్రయాణాల్లో మాస్కులు ఇక మస్ట్ కాదు!
posted on Nov 16, 2022 @ 11:05PM
విమాన ప్రయాణాలలో మాస్క్ ఇక మస్ట్ కాదు. కోవిడ్ ప్రొటోకాల్ కు సవరణలు చేస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నిరోధించేందుకు గతంలో విమానప్రయాణీకులు మాస్కులు వాడటం తప్పని సరి చేసిన సంగతి విదితమే.
అప్పటి నుంచి అదే నిబంధన కొనసాగుతూ వస్తోంది. అయితే కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం ఇకపై వ ప్రయాణాలలో మాస్కులు, ఫేస్ షీల్డులు వాడాల్సిన అవసరం లేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. అయితే అయితే కరోనా వైరస్ ముప్పు దృష్ట్యా ప్రయాణికులు ఫేస్ మాస్క్ లను వాడటం శ్రేయస్కరమని ఆ ప్రకటనలో పేర్కొంది.
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను సంప్రదించి, విమానాల్లో ప్రయాణించేటపుడు ప్రయాణికులు ఫేస్ మాస్క్‌లు, ఫేస్ కవర్ల వాడటంపై సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇకపై విమానాలలో ప్రయాణికులను ఉద్దేశించి చేసే ప్రకటనల్లో ఫేస్ మాస్క్ వాడకపోతే జరిమానా, దండన చర్యల ప్రస్తావన వద్దని ఆదేశించింది. కరోనా వైరస్ ముప్పు దృష్ట్యా ఫేస్ మాస్క్ వాడటం శ్రేయస్కరమని మాత్రమే చెప్పాలని తెలిపింది.