హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
posted on Sep 6, 2025 @ 4:12PM
తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటివరకు చిన్నాచితక డ్రగ్స్ గంజాయి ప్యాకెట్స్ లభ్యమయ్యాయి . కానీ ఓ ఫ్యాక్టరీ లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేయడమే కాకుండా ఆ డ్రగ్స్ ని పోలీసుల కంట పడకుండా దేశ విదేశాలకు రవాణా చేస్తున్నారు. ఇంత పెద్ద దందా కొనసాగుతున్న కూడా ఇప్పటివరకు ఈ విషయం బయటపడలేదు. దీంతో ఆ కంపెనీ యాజమాన్యం యదేచ్ఛగా పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను తయారుచేసి విదేశాలకు సరఫరా చేస్తున్నారు.
అయితే థానే కి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరం లోకి అడుగుపెట్టి మేడ్చల్ జిల్లాలోని ఎండి డ్రగ్స్ కంపెనీపై సోదాలు చేయ డంతో తీవ్ర కలకలం రేగింది. మరో రాష్ట్రం నుండి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వచ్చి ఇక్కడ సోదాలు చేయడం ఏంటా అని అందరూ ఆశ్చర్యపో యారు. కానీ ఈ సోదాల్లో విస్తు పోయే విషయాలు వెలుగులోకి రావ డంతో అందరూ ఆశ్చర్య చకితుల య్యారు. అవునండి ఒకటి కోటి కాదు... రెండు కోట్లు కాదు ఏకంగా 12 వేల కోట్ల రూపా యల విలువచేసే డ్రగ్స్ ని తానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టు కున్న ఘటన హైదరాబాద్ నగరాన్ని ఊపేసింది
హైదరాబాదులోని మేడ్చల్ జిల్లాను కేంద్రంగా చేసుకొని కొంతమంది కేటుగాళ్లు కెమికల్ ఫ్యాక్టరీ మాటుగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు.... మహారాష్ట్ర తానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే వారు హైదరాబాదు నగరానికి వచ్చి మేడ్చల్ జిల్లాలోని ఎండి డ్రగ్స్ కంపెనీ పై సోదాలు చేసి 13 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 12 వేల కోట్ల విలువచేసేఅత్యంత ప్రమాదకరమైన ఎక్స్ టిసి, మోలీ, ఎక్స్‌టీసీ మొదలగు మూడు రకాల డ్రగ్స్ ని స్వాధీనం చేసు కున్నారు.
మొత్తం 32 వేల లీటర్ల రా మెటీరియల్ ని అధికారులు స్వాధీన పరచుకు న్నారు. అనంతరం తానే క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్ జిల్లాలోని ఎండి డ్రగ్స్ కంపెనీని సీజ్ చేశారు... మేడ్చల్‌ను కేంద్రంగా చేసుకొని డ్రగ్స్ తయారు చేయడమే కాకుండా ఈ డ్రగ్స్ ను దేశ విదేశాలకు తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.
అయితే ఒక బంగ్లా దేశ మహిళను తానే పోలీసులు అరెస్టు చేసి తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో హైదరాబాదు నగరంలో ఉన్న ఈ ఎండి డ్రగ్స్ కంపెనీ వ్యవహారం కాస్త బట్టబయలు అయినట్లుగా సమాచారం. అసలు ఈ ఫ్యాక్టరీ ఎవరిది? ఎన్ని సంవత్సరాలు గా ఈ డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతున్నది? గుట్టు చప్పుడు కాకుండా దేశ విదేశాలకు డ్రగ్స్ ను ఎలా తరలిస్తు న్నారు? ఈ డ్రగ్స్ దందా వెనక ఎవరెవరు ఉన్నారనే వ్యవహారాన్ని తెలుసుకునేందుకు పోలీసులు అరెస్టు చేసిన 13 మందిని విచారణ చేస్తున్నారు.