బాబోయ్.. మోస్ట్ డేంజర్ ఫుడ్.. దీన్ని తిన్న ప్రతి సారి 36నిమిషాల జీవితకాలం మటాష్..!
posted on Jul 17, 2025 @ 9:30AM
ఆహారం శరీరానికి శక్తి వనరు. తీసుకునే ఆహారాన్ని బట్టి శరీర ఆరోగ్యం ఆధాపడి ఉంటుంది. అయితే పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని పెద్దలున్నారు. కానీ నేటి కాలంలో మాత్రం జిహ్వకు బోలెడు రుచులు కావాలి. నేచి జనరేషన్ లో తిండి మీద చూపిస్తున్న ఆసక్తి వేరే దేని మీద లేదంటే అతిశయోక్తి కాదు.. దీనికి తగినట్టే వీదులలో బోలెడు ఫుడ్ సెంటర్లు కూడా పుట్టగొడుగుల్లా వచ్చేసాయి. కానీ ఆహారం అనేది శరీరాన్ని దృఢంగా ఉంచేలా ఉండాలని ఆయుర్వేదం చెబుతుంది. అయితే దీన్ని పాటించేవారు ఇప్పట్లో చాలావరకు తగ్గిపోయారు. మరీ ముఖ్యంగా రుచి కోసం తింటున్న ఆహారాలు మనిషి ఆయుష్షును తగ్గించేస్తున్నాయ్ అని అంటున్నారు. వాటిలో చాలా డేంజర్ ఫుడ్ కూడా ఉంది. ఈ ఫుడ్ ఐటమ్ తిన్న ప్రతి సారి 36 నిమిషాల మానవ జీవితకాలం తగ్గిపోతోందట. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటి? తెలుసుకుంటే..
ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. నగరాల్లోనే కాదు, ఇప్పుడు గ్రామాల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత ఫాస్ట్ ఫుడ్ అంటే పడి చస్తారు. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసి కూడా సంతోషంగా తింటున్నారు. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ ల గురించి చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
హాట్ డాగ్ తినడం వల్ల ఒక వ్యక్తి వయస్సు 36 నిమిషాలు తగ్గుతుందని, సోడా తాగడం వల్ల 12 నిమిషాలు తగ్గుతుందని పరిశోధకులు తమ పరిశోధనలలో కనుగొన్నారు. సంతోషంగా తినే ఫాస్ట్ ఫుడ్ వాస్తవానికి ఆయుష్షును మింగేస్తోందని వారు అంటున్నారు.
శాండ్‌విచ్‌లు, గుడ్లు జీవితాన్ని 13 నిమిషాలు తగ్గిస్తాయట. చీజ్ బర్గర్‌లు దాదాపు 9 నిమిషాలు, బేకన్‌ను 6 నిమిషాలు తగ్గిస్తాయని అంటున్నారు.
ఇవి ఎందుకు ప్రమాదం అంటే..
అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు ఆయుష్షు తగ్గడానికి ప్రధాన కారణాలు.. ఎందుకంటే వాటిలో ఎటువంటి పోషకాహారం లేకపోవడం, శుద్ధి చేసిన చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, ఉప్పు, ఉత్పత్తులు పాడవకుండా ఉండటం కోసం వినియోగించే రసాయనాలు, కృత్రిమ రుచులు, రంగులు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయి.
ప్రమాదాలు..
ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాలక్రమేణా అవి దీర్ఘకాలిక మంట, ఊబకాయం, గుండె జబ్బులు, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతాయి.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ పెద్ద మొత్తంలో తీసుకునే వ్యక్తులు గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం 50% ఎక్కువగా ఉంటుంది. ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలతో బాధపడే అవకాశం 48-53% ఎక్కువగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉంటుందట.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..