ఈ కాలంలో పిల్లల్ని వేధించే అనారోగ్య సమస్యలు..
posted on Mar 29, 2022 @ 9:30AM
ఎండా కాలం లో పిల్లల్ని వేదించే అనారోగ్య సమస్యలు...ఎండాకాలంలో పిల్లలు రక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు వేదిస్తూ ఉంటాయి. వాటి ఉపశమనానికి తీసుకో వాల్సిన ఉపసమనం జహ్రతలు గురించి తెలుసుకుందాం. మీ ఇంట్లో పిల్లలు ఉంటె కొంచం వారి ఆరోగ్యం పైదృష్టి పెట్టండి ఎండాకాలం ప్రారంభ మయ్యింది. పిల్లల్ని వివిదరకాల అనారోగ్య సమస్యలు వేదిస్తూ ఉంటాయి. వాటికీ ఉపసమన చర్యలు ఏమిటో తెలుసుకుందాం.ఏప్రిల్,మే,జూన్ నెలలో వచ్చే మార్చి నెలలోనే కనిపిస్తోంది. దీనిని బట్టి రానున్న నెలలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రానున్న ఎండాకాలం లో ఎండలు మరింత తీవ్రంగా ఉందవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో వృద్దుల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంటుంది.ఇక పిల్లల విషయంలో మరింత తీవ్రంగా ఉంటుంది. ఇక పిల్లలకు ఎండాకాలం లో వచ్చే సమస్యలు వాటికి ఉపసమన మర్ఘాలు చూద్దాం.
దురద సమస్య...
ఎండాకాలం లో వచ్చే చమట కారణంగా శరీరం లోని ఇతర ప్రాంతా లలో దురద సమస్య ఎక్కువగా వేదిస్తుంది.ఎండ వల్ల చర్మం పై వచ్చే రక రకాల దద్దుర్లు. కీలక పాత్ర పోషిస్తాయి. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాలాలో ఎక్కువగా దోమకాటు ఈ సమయం లోనే ఎక్కువగా ఉంటుంది. దోమ కాటు వల్ల చర్మం పై వాపు దద్దుర్లు దురద తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఉంటుంది.
పరిష్కారం సూచన...
దురదల నుండి పిల్లల ను రక్షించు కునేందుకు ముందుగా స్నానం చేసిన తరువాత అవసరమైన పక్షం లో మాయిస్చర్ రాయండి.ఉపసమనం కలిగించే కాటన్ దుస్తులను పిల్లలకు తొలగండి. ఎండలోకి వెళ్ళినప్పుడు శరీరానికి పూర్తిగా కప్పాలి పిల్లలు సహజంగా బయటికి వెళ్లి ఆడుకోవాలని ఉంటుంది. అదే సమయంలో పిల్లలు ఎండలోకి వెళ్ళినప్పుడు దోమల నుండి కాపాడే క్రీమును రాయండి.
ర్యాషేస్...
పిల్లలను సహజంగా ఎండాకాలం లో వేదించే మరో సమస్య ర్యాష్ దద్దుర్లు. ఎండాకాలంలో వచ్చే చమట పూర్తిగా ఎండక పోవడం.వల్లే శరీరంలో ర్యాషేస్ వస్తాయని నిపుణులు పేర్కొన్నారు చర్మం పై వచ్చే ర్యాషేస్ పిల్లలను పెద్దలను వేదిస్తూ ఉంటాయి.దీనివల్ల చర్మం పై ఎర్రటి దద్దుర్లు ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుంది.
ర్యాషేస్ నుండి ఉపసమనం పొందాలంటే...
ఈ సమస్యకు ఒక్కటే ఉపచారం. పిల్లలకు అణువుగా ఉండే వస్త్రాలను వేసుకునే అలవాటు చేయండి. దీనికారణం గా వారి శరీరంలో వచ్చిన చమట సులభంగా ఆరిపోతుంది. ముఖ్యంగా ఎండా కాలం లో పిల్లలకు కాటన్ దుస్తులు ఉత్తమమని సూచ్స్తున్నారు నిపుణులు.
జ్వరం- దగ్గు-జలుబు...
ఎండాకాలం లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో జలుబు,జ్వరం, దగ్గు వంటి సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయిఈ కారణం గానే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే ఎండవేడికి ఏడవడం లేదా చికాకు పడడం చూడవచ్చు.
పరిష్కారం/సూచన....
సహజంగా వచ్చే ఇలాంటి సమస్య నుండి పిల్లలను రక్షించుకోవాలంటే ముందుగా తప్పని సరిగా చేయాల్సిన పని వారి ఇమ్యూన్ సిస్టం రోగ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఆహారాన్ని ఇవ్వాలి.సహజంగా పిల్లలలు ఆహారం తీసుకునేందుకు ఎండాకాలం అయిష్టత చూపిస్తారు. మారాం చేయడం, మొనితనం చేయడం వంటి పనులతో సరిగా ఆహారం తీసుకోక పోవడం వల్ల పూర్తిగా నీరసించి పోతారు.అయితే పిల్లలకు వివిధ పద్దతుల ద్వారా ఆహారాన్ని తినిపించాల్సిన బాధ్యత తల్లి తండ్రులదే. దీనితో పాటు పిల్లలతో ఉంటూనే వివిదరకాల శారీరక వ్యాయామం వారికి అలవాటు చేయమని నిపుణులు సూచిస్తున్నారు.
గ్యాస్ సమస్యలు...
వయస్సుతో నిమిత్తం లేకుండా వేదించే మరో సమస్య గ్యాస్. ముఖ్యంగా ఎండాకాలం లో ఆహారం తీసుకోక పోవడం వల్ల పిల్లలలో నీరసం అలసట డీ హైడ్రే షన్ కు గురి అవుతూ ఉంటారు.ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం మనం ఎండాకాలం లో మనం తీసుకునే ఆహారం పాడై పోతుంది. ఇదే సమయం లో ఫుడ్ పాయిజన్ అంటే ఆహారం విష పూరితంగా మారి పోవచ్చు. ఇది పిల్లల విషయం లో ఏమాత్రం అశ్రద్ధ చేసినా సమస్య మరింత తీవ్రతర మౌతుంది. ముఖ్యంగా స్చూల్కు వెళ్ళే పిల్లల లో పొట్ట నొప్పి, వాంతులు,నీరసం కారణం అవుతుంది.
పరిష్కారం/సూచన...
స్చూలుకు వెళ్ళే పిల్లల టిఫిన్ బాక్స్ లలో త్వరగా పాడవ్వని ఆహారాన్ని అంటే పండ్లు, లేదా కోసిన పండ్లు వారికి తినే అలవాటు చేయాలి దాని కారణంగా ఎండాకాలం లో వచ్చే వడ దెబ్బ లేదా ఇతర అనారోగ్య సమస్యల నుండి బయట పడే అవకాశం ఉంది. .