వేసవిలో విరివిగా లభించే మామిడి ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

పండ్లలో రారాజుగా మామిడిని చెప్పుకుంటారు.   ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల మామిడిపండ్ల రకాలు  ప్రసిద్ధి చెందాయి. మామిడి పండ్లు  రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం మామిడి పండ్లు మాత్రమే కాదు.. మామిడి చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యపరంగా మంచిదే..  మామిడి ఆకులు కూడా  ఆరోగ్యానికి  అంతే ముఖ్యమైనవి. శాస్త్రీయంగా మామిడి ఆకులను మాంగిఫెరా ఇండికా అంటారు. భారతీయులు మామిడి ఆకులను పండుగలు, శుభకార్యాలలో తోరణాలు కట్టడానికి ఉపయోగిస్తారు. అయితే ఆయుర్వేదం మాత్రం మామిడి ఆకులను ఆరోగ్యం కోసం కూడా ఉపయోగిస్తుంది. అసలు మామిడి ఆకులలో ఉండే పోషకాలేంటి?  మామిడి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..

మామిడి ఆకులలో పోషకాలు..

మామిడి ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఎ,  విటమిన్ బి వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో స్టెరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, రైబోఫ్లావిన్, థయామిన్, ఫినాలిక్, బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ మొదలైన సమ్మేళనాలు ఉంటాయి. మామిడి ఆకులలో టెర్పెనాయిడ్స్,  పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి  శరీరంలోని వ్యాధి నుండి రక్షణ కల్పిస్తాయి.  మంటతో పోరాడుతాయి.

ప్రయోజనాలు..

మామిడి ఆకుల సారం చర్మం మీద సన్నని గీతలు, వృద్ధాప్య సంకేతాలు, చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇది ముఖం నుండి ముడతలు,  ఫైన్ లైన్లను తగ్గిస్తుంది.

మామిడి ఆకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు  ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా వల్ల కలిగే చర్మ ఇన్ఫెక్షన్లు,  చికాకులకు చికిత్స చేయడంలో సహాయపడతాయి.

డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్ బ్యాలెన్స్ చేయడంలో మామిడి ఆకులు సహాయపడతాయి. ఈ ఆకులలో ఆంథోసైనిడిన్ అనే టానిన్ ఉంటుంది. ఇది  మధుమేహం మొదటి దశలో ఉన్నప్పుడు  చికిత్సలో సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలంటే..

 ఒక కప్పు నీటిలో 10-15 మామిడి ఆకులను వేసి మరిగించాలి. తర్వాత ఆ నీటిని రాత్రంతా చల్లారనిచ్చి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. దీన్ని గాల్,  కిడ్నీ స్టోన్స్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో,  మూత్రం ద్వారా వాటిని  శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతుంది.


ఎలా ఉపయోగించాలంటే..

కొన్ని మామిడి ఆకులను తీసుకుని వాటిని పొడి చేయాలి. ఈ పొడిని  నీటిలో కలపాలి. ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. శరీరంలో నిల్వ ఉండే కొవ్వు స్థాయిని తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

                                      *నిశ్శబ్ద.