Read more!

తులసి గురించి ఆయుర్వేదంలో ఉన్న షాకింగ్ చిట్కాలు!!

 చర్మవ్యాధుల్ని  పోగొట్టడంలో  తులసి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తామర మొదలైన చర్మ వ్యాధులకు తులసి ఆకులను నూరి, నిమ్మపండు రసం కలిపి పైన రాస్తారు. క్రిములను సైతం తులసి సంహరిస్తుంది. ఎక్కిళ్ళు, ఆయాసం, దగ్గు మొదలైన శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమవుతాయి. నిమోనియా, మలబద్ధకాలకు తులసి మంచి ఔషధం. మలేరియా జ్వరానికి తులసీ దళాల కషాయం బాగా పనిచేస్తుంది. ఎండు తులసి ఆకులను నీళ్ళలో (10 తులాల నీళ్ళకు ఒక తులం ఆకు వంతున) వేసి మరిగించి, ఆ కషాయాన్ని రొమ్ము పడిసెం మొదలైనవాటికి వాడతారు. చెవిపోటు వస్తే తులసి ఆకు రసాన్ని చెవిలో పిండితే తగ్గిపోతుంది.

మానకుండా ప్రతి రోజూ రెండు పూటలా తులసీ దళాలను సేవించడం వల్ల రక్తపోటు, క్యాన్సర్, కడుపులో పుండు మొదలైనవి రావు. అలాగే ప్రతి రోజూ ఉదయం తులసి ఆకును నలిపి, ఒక తులం రసం తీసి తాగుతుంటే జీర్ణజ్వరాలు, విరేచనాలు మొదలైనవి తొలగిపోతాయి. పిల్లలకు కడుపుశూల వస్తే, తులసి ఆకు రసంలో కొద్దిగా అల్లపు రసాన్ని కలిపి తాగిస్తారు. ఒక తులం తులసి రసంలో పావు తులం నల్ల మిరియాల రసం కలిపి తాగిస్తే, జలుబుతో కూడిన జ్వరం, విడవకుండా వస్తున్న జ్వరం కూడా తగ్గిపోతాయి.

అలాగే, అప్పటికప్పుడు తాజాగా తీసిన తులసి రసాన్ని తాగిస్తే వాంతులు కట్టేస్తాయి. పేగుల్లో ఉండే క్రిములు నశిస్తాయి. వాంతులు, విరేచనాలు అవుతుంటే, పిల్లలకు తులసి గింజలను ఆవు పాలతో నూరి తాగిస్తారు.

శరీరంలో వేడిని పెంచే గుణం తులసికి ఉంది. అందుకే, అవసాన దశలో శరీరం చల్లబడుతున్నప్పుడు గొంతులో తులసీ రసం (తీర్థం) పోస్తారు.

తులసి ఆకుల్ని వాసన చూస్తే జలుబు పోతుంది. తులసీ  రసాన్ని కళ్ళల్లో వేస్తే చూపు బలపడుతుంది. కళ్ళల్లో నీళ్ళు కారడం ఆగుతుంది. చెవిలో పోస్తే చెవుడు పోతుంది. ఆకును నమిలి చెవిలో పెడితే, చెవి పోటు తగ్గుతుంది. సూర్యోదయం కన్నా ముందే ఆకులు నమిలి, దంతాలకు రుద్దితే పంటి నొప్పి రాదు. తులసి ఆకుల్ని నూరి, వేడి నీటితో కలిపి పుక్కిలించినా, నమిలినా నోరు పొక్కడం మానుతుంది. ఇక, తులసి గింజల్ని తాంబూలంతో సేవిస్తే, గొంతు వాపు పోతుంది. దీని ఆకు రసంతో తేనె కలిపి ఇస్తే, గట్టిగా ఉండే శ్లేష్మం పల్చబడి బయట పడుతుంది. అలాగే, దగ్గు, రొమ్ము పడిసెం మొదలైనవి కలిగినప్పుడు తులసి రసంలో తేనె, అల్లపు రసం, నీరుల్లి రసం కలిపి ఇస్తే, కఫం తెగి పడుతుంది.

తులసి ఎండుటాకును నూరి, నస్యం చేస్తే ఉబ్బసం తగ్గుతుంది. తులసి రసాన్ని తేనెతో కలిపి ఇస్తే, ఆకలి కలుగుతుంది. అన్నకోశానికి శక్తి నిస్తుంది. జీర్ణశక్తిని కలిగిస్తుంది. వాంతులు ఆగుతాయి. తులసి ఆకుల రసాన్ని, శొంఠి పొడి కలిపి ఇస్తే చలి జ్వరం పోతుంది.

జలుబు చేసిన వాళ్ళు రోజుకు మూడు, నాలుగు సార్లు తులసి ఆకులు కొన్ని తీసుకొని, బాగా నమిలి మింగాలి. లేదంటే, మరుగుతున్న నీటిలో ఆ ఆకులు వేసి కొద్దిసేపు ఉంచి, వడపోసి, అందులో కాస్త పంచదార, రెండింతల పాలు పోసి, కాఫీ లాగా తాగాలి. దీని వల్ల రొంప తగ్గి, జ్వరం రాదని వైద్యులు చెబుతుంటారు. ఇలా గృహ కృత్యాలలో, సామాన్య వ్యాధులకు అన్నిటికీ తులసి దివ్యౌషధం. ప్రాణదాయక, ప్రాణరక్షక శక్తులు తులసిలో ఉండడంతో జగద్రక్షకుడైన విష్ణుమూర్తికి ఇది ప్రియమైనదని హిందువులు నిశ్చయించారు.


                                         *నిశ్శబ్ద.