నన్ను కొట్టారు.. మా అమ్మను అవమానించారు.. రాహుల్..కేజ్రీవాల్ అప్పుడు మాట్లాడలేదేం..?
posted on Jan 22, 2016 @ 10:00AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలసిందే. అయితే ఈ వివాదానికి సంబంధమున్న అత్యంత కీలకమైన వ్యక్తి ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ రాహుల్ గాంధీ.. కేజ్రీవాల్ పై మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ సంఘానికి చెందిన 30 మంది వచ్చి నన్ను కొట్టారని.. నాచేత బలవంతంగా క్షమాపణలు చెప్పించారని అన్నారు. తనపై దాడి చేసిన వారిపై కృష్ణ చైతన్య అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే నువ్వు ప్రత్యక్షంగా చూశావా అని ప్రశ్నించారని.. లేదని చెప్పటంతో నాపై దాడి జరగలేదని తేల్చారని వాపోయాడు. మరో విద్యార్ది సాక్ష్యం చెప్పడంతో విద్యార్థులపై ఆర్నెల్లు సస్పెన్షన్ విధిస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్న విషయాన్ని సుశీల్ వెల్లడించారు.
అంతేకాదు తనపై దాడి చేసిన ఉదంతానికి సంబంధించి ఆధారాలు.. సాక్ష్యాలు ఉన్నాయని.. సుశీల్ కుమార్ చెప్పారు. తనపై దాడి జరిగిన విషయంపై మా అమ్మ ఫిర్యాదు చేయడానికి వెళితే.. వీసీ ఛాంబర్ లోనే అవమానించారని.. దానికి సంబంధించిన ఆధారాలు కావాలంటే సీసీ కెమేరా ఫుటేజ్ పరిశీలించాలని కోరారు.
తన కులం ఓబీసీ అని ఒక ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి భావస్వేచ్ఛను హరించినప్పుడు కేజ్రీవాల్, సీతారాం ఏచూరి ఎక్కడికి వెళ్లారు? నన్ను కొట్టినప్పుడు వాళ్లేందుకు మాట్లాడలేదు..మా అమ్మకు వీసీ ఛాంబర్ లోనే అవమానం జరిగింది. దానికి ఇప్పటివరకూ ఎవరూ మాట్లాడింది లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.