భార్య రాలేదని.. భర్త ..
posted on Mar 17, 2021 @ 12:00PM
నిత్యం భార్య భర్తల మధ్య గొడవలు. ఆ కుటుంబ కలహాలతో భర్త పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లిన భర్తను భార్య పలకరించలేదని. కనీసం ఎలా ఉన్నాడని కూడా చూసేందుకు రాలేదని. తీవ్ర మనస్థాపానికి గురైన ఆ భర్త మరోసారి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఒక వ్యక్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనం మూడో అంతస్తు పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ చెందిన శేఖర్ అనే వ్యక్తి గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు పెరగడంతో మనస్తాపానికి గురైన శేఖర్ మంగళవారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిసింది. అనంతరం శేఖర్ ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందిన అనంతరం శేఖర్ ఇంటికి వెళ్ళాడు. ఈ రోజు ఇంటికి వెళ్లిన శేఖర్ తన భార్య తనని చూడడానికి కూడా రాలేదని మనస్థాపానికి గురై ఆస్పత్రి మూడో అంతస్తుకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీసులు సమయస్ఫూర్తితో చాకచాక్యంగా వ్యవహరించి సదరు వ్యక్తిని భవనం పై నుండి కిందికి దింపడంతో ప్రమాదం తప్పింది.