హరీష్‌రావుని బ్లాక్‌మెయిల్ రాజకీయాలు
posted on Apr 6, 2011 @ 9:42AM
హైదరాబాద్: సమైక్యరాష్ర్టం అంటూ చంద్రబాబు నాయుడు తన మనసులోని మాటనే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్పించారంటూ టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఆరోపించడంపై టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, ఎర్రబెల్లి దయాకరరావులు ఎన్టీఆర్ భవన్ లో వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశాల్లో ఖండించారు. పంచాంగ కర్తలు వారి పంచాంగం చెప్పారని, అంతమాత్రన అది పార్టీ విధానం ఎలా అవుతుందా అని వారు ప్రశ్నించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ వద్దకు పంపకుండా తమ వద్దే పెట్టుకున్న టీఆర్‌ఎస్, తమపై నిందారోపణలు చేయడంలో అర్థం లేదన్నారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ముగ్గురే అని ఇప్పటివరకు తెలుసని, కాని వీరితో పాటు కేసీఆర్ బంధువులైన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్‌కు పాల్ప డినట్లు తెలుస్తోందన్నారు. కేసీఆర్ ఆ ఆరుగురిపై ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేశాం, ప్రాణత్యాగాలకు సిద్ధం అంటూ ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజలు గెలిపించారని, మరి ఇప్పుడు కాంగ్రెస్‌కు ఎట్లా అమ్ముడుపోయారని ప్రజలు అడుగుతు న్నారని వారు నిలదీశారు. హరీష్‌రావు ఇప్పటికైనా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోవాలని వారు హితవు చెప్పారు.