ఆత్మహత్య చేసుకుంటుంది.. కాపాడమంటే కొట్టి చంపారు..
posted on Jul 18, 2016 @ 11:10AM
గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యను ఆపమన్నందుకు.. ఇద్దరు యువకులను స్థానికులు చితక్కొట్టారు. వారిలో ఒకరు మరణించగా.. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో 19 ఏళ్ల షేక్ జాస్మిన్ అనే యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని వారి స్నేహితురాళ్లకు కూడా ఫోన్ చేసి చెప్పింది. అయితే అదే సమయంలో అటుగా వెళుతున్న వేముల శ్రీసాయి, జొన్నా పవన్ కుమార్ లు ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు గుర్తించి.. చుట్టుపక్కల వారికి చెప్పడానికి వెళ్లారు. ఈలోపు ఆమె ఉరేసుకొని మరణించింది. కానీ స్థానికులు మాత్రం వారే ఆమెపై అత్యాచారం చేసి చంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు వారు ఎంత చెప్పినా వినకుండా చితక్కొట్టారు. అయితే ఆఖరికి జాస్మిన్ స్నేహితురాళ్లు అసలు విషయం చెప్పగా వారికి క్షమాపణలు చెప్పి వదిలేశారు.
కానీ ఈ దాడిలో వేముల శ్రీసాయికి తీవ్ర గాయాలవ్వగా ఆస్పత్రిలోనే చికిత్స పొందతూ మరణించాడు. పవన్ కుమార్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. దీంతో తన బిడ్డను అనవసరంగా చంపారని శ్రీసాయి తల్లిదండ్రులు నిరసనలకు దిగారు.