గుజరాత్ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్
posted on Nov 18, 2012 @ 10:37AM
గుజరాత్ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ ని ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొదటి దశలో డిసెంబర్ 13న రాష్ట్రంలో 87 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయ్. అభ్యర్ధులు ఈ నెల 24లోగా నామినేషన్లు సమర్పించాల్సుంటుంది.
అధికార బిజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఇంకా అభ్యర్ధుల్ని ఖరారు చేయనేలేదు. కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితాని తయారుచేసేందుకు గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపికలో తలమునకలైన బిజెపి కొన్ని పేర్లని అధిష్టానం పరిశీలనకోసం పంపింది.
గుజరాత్ ఎన్నికలకోసం ఈసీ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. పెద్దఎత్తున భద్రతా బలగాల్ని దించుతోంది. తొలిసారిగా రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక పరీక్షని రాయబోతున్నారు. నవంబర్ 23న రెండోదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది.
ప్రచారపర్వంలో ముందంజలో ఉండేందకు బిజెపి తొలిసారిగా త్రీడీ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పోటోని త్రీడీ ఫార్మేట్ లో సభావేదికలమీదికి తీసుకొచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల మోడీ పూర్తిగా జనం మధ్యలోనే ఉన్నరన్న భావనని కలిగించేందుకు బిజెపి ఈ ఏర్పాట్లు చేస్తోంది.