జీఎస్టీ బిల్లుతో పెరిగే, తగ్గే ధరలు ఇవే..
posted on Aug 3, 2016 @ 4:47PM
పార్లమెంట్లో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఎట్టకేలకు సభలో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై గతంలోనే అరుణ్ జైట్లీ.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ పార్టీలతో మంతనాలు జరిపారు. దాదాపు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఇక ఈ పార్టీకి ఎప్పటినుండో అడ్డంకిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త మెత్తబడినట్టే కనిపిస్తోంది. ఇక అన్నీ కుదిరితే ఈబిల్లు ఆమోదం పొందడం ఒక్కటే ఆలస్యం. అంతేకాదు బిల్లు కనుక ఆమోదం పొందితే వచ్చే ఏడాది నుండి అమలు చేయాలని కూడా బీజేపీ భావిస్తుంది. మరి ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే ఏ ధరలు పెరుగుతాయో.. ఏ ధరలు తగ్గుతాయో చూద్దాం.
ధరలు తగ్గేవి..
* ఎంట్రీ లెవల్ కార్లు, ద్విచక్ర వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు
* కారు బ్యాటరీల ధరలు కూడా దిగొస్తాయి.
* పెయింట్, సిమెంట్ ధరలు తగ్గుతాయి.
* వినోదపు పన్ను గణనీయంగా తగ్గుతుంది కాబట్టి సినిమా టికెట్ ధరలు దిగొస్తాయి.
* ఫ్యాన్లు, లైటింగ్, వాటర్ హీటర్లు, కూలర్ల తదితరాలపై పన్నులు తగ్గి ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయి.
ధరలు పెరిగేవి..
* పొగాకు మీద జీఎస్టీ పన్ను మరింతగా పెరుగుతుంది కాబట్టి సిగరెట్లు, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి.
* ఇప్పుడున్న సేవా పన్నుతో పోలిస్తే మొబైల్ రంగంపై పన్ను భారం పెరుగుతుంది కాబట్టి సెల్ ఫోన్ల ధరలు పెరుగుతాయి.
* దుస్తులు, బ్రాండెడ్ ఆభరణాల ధరలూ పెరుగుతాయి.