జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ ఓకే..!
posted on Jul 19, 2016 @ 10:32AM
కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్టీ) బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టే ప్రయత్నాలు చేసింది. అయితే ఈసారి మాత్రం ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపే అవకాశం ఉందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఈ బిల్లుకు ఆమోదం తెలుపడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధాని మోడీ కూడా పలుమార్లు ఈ బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఇంకా కాంగ్రెస్ లో కీలక నేతలతో భేటీ అయ్యారు. అప్పుడు పలు అడ్డుపుల్లలు వేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి త్రప్రాయంగా అంగీకరించింది. దీనికి కాంగ్రెస్ ఓ షరతు పెట్టగా.. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి.. కాంగ్రెస్ డిమాండ్ మేరకు రాజ్యసభలో కనీసం 5 గంటలపాటు చర్చించడానికి అంగీకరించింది. అయితే చర్చ చేపట్టే తేదీని మాత్రం ఇంకా నిర్ణయించలేదు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అయితే తమ మద్దతు తెలిపింది కానీ.. మిగిలిన పార్టీ కూడా ఆమోదం తెలిపితేనే బిల్లు పాస్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రథాని మోడీ మిగిలిన పార్టీల ఆమోదాన్ని పొందడానికి కూడా వారితో చర్చలు జరపాలని పార్టీ నేతలకు సూచించారట. ఇక అన్ని పార్టీలు కనుకు ఆమోదం తెలిపినట్టయితే.. బిల్లు అమలైనట్టే. చూద్దాం ఏం జరగుతుందో.