గ్రీన్, వేడ్ వీరవిహారంతో ఆసీస్ విజయం
posted on Sep 20, 2022 @ 11:21PM
మొహాలీలో ఆసీస్‌తో తలపడిన మొదటి టీ20లో గ్రీన్, వేడ్ వీర బాదుడుతో, భువనేశ్వర్, హర్షల్ చెత్త బౌలింగ్‌తో భారత్ ఓడి పోయింది. మూడుమ్యాచ్‌ల సిరీ స్‌లో మొదటి మ్యాచ్‌లో ఆసీస్ చివరి ఓవర్లో ఇంకా నాలుగు బంతులు ఉండగానే గెలి చింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ అత్యధికంగా 209 పరుగులు చేసింది. వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజ యం సాధించింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలిం గ్ చేసి 4 ఓవర్లలో 17 పరుగు లిచ్చి 3 వికెట్లు తీశాడు.
మొదట బ్యాట్చేసిన భారత్ పవ ర్ ప్లే ముగిసే సమయానికి 46 పరుగులే చేసి కెప్టెన్ శర్మ, కింగ్ కోహ్లీ వికెట్లు కోల్పోయింది. శర్మ 9 బంతుల్లో 11 పరుగులే చేశాడు. మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు అనుకున్న కోహ్లీ 7 బంతుల్లో కేవలం 2 పరుగులే చేసి వెనుదిర గడం అభిమానులను నిరాశపరిచింది. భారత్ 50 పరుగులు 7వ ఓవర్లో పూర్తిచేయగలిగింది. ఒక వంక కెప్టెన్ వెను దిరిగి నప్పటికీ మరోవంక కె.ఎల్. రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిలబెట్టేడు. రాహుల్ మంచి షాట్స్ ప్రదర్శించాడు. ఊహిం చని విధంగా సిక్స్లు కొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. 8వ ఓవరో్ల కొట్టిన సిక్స్‌తో రాహుల్ టీ20ల్లో 2000 పరుగులు అధిగ మించాడు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.
11వ ఓవర్లో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2 సిక్స్‌లతో సహా రాహుల్ 50 పరుగులు 32 బంతుల్లో కొట్టాడు. అప్పటికి భారత్ 91 పరుగులు చేసినట్లయింది. రాహుల్, సూర్యకుమార్లు అప్పటికి 39 బంతుల్లో 56పరుగులు పూర్తిచేశారు. 12వ ఓవర్లో భారత్ వందపరుగులు పూర్తిచేసింది. హాజల్ఉడ్ ఓవర్లో రాహుల్ వెనుదిరిగాడు. అతను 35 బంతులో్ల 55 పరుగులు చేయ గలిగాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా అద్భుతంగా బ్యాట్ చేశాడు. ఆసీస్ బౌలర్ల భరతం పట్టాడు. 13వ ఓవర్ స్పిన్నర్ జాంపా వేయగా ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ముఖ్యంగా పాండ్యా ఇరగదీశాడు. 14వ ఓవర్లో సూర్య అవుట య్యాడు. అతను 24 బంతుల్లో 46 పరుగులు చేశాడు. పాండ్యాతో కలిసి వేగంగా పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 126 పరుగులకు చేరుకుంది. 15వ ఓవర్లో కమిన్స్ పది పరుగులు ఇచ్చుకున్నాడు. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 141 పరుగులుచేసింది. 16వ ఓవర్లో అక్షర్ అవుటయ్యాడు. తర్వాత కార్తిక్ వచ్చాడు కానీ అతను కేవలం రెండు పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచాడు. భారత్ 150 పరుగులు 17వ ఓవర్లో పూర్తయ్యాయి. 18వ ఓవర్లో భారత్ కు 16 పరుగులు రావడంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 176 చేసింది. మరో ఎండ్‌లో పాండ్యా వీరబాదుడుతో భారత్ 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది. పాండ్యా కేవలం 30 బంతులోల్ 71 పరుగులు చేశాడు. భారత్ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 13 సిక్స్‌లు రావడం గమనిచదగ్గ అంశం.
ఆసీస్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే మొదటి నుంచే ధాటిగా ఆడారు. భారత్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఫించ్, గ్రీన్ లు భారత్ పేసర్లు భువనేశ్వర్, ఉమేష్ యాదవ్‌లను సునాయాసంగా ఆడారు. ఏదో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నంత సులువుగా ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ మొదటి ఆరు ఓవర్లలోనే జట్టు స్కోర్ 50 పరుగులకు చేర్చారు. ఆ సమయంలో ఫించ్‌ను స్పిన్నర్ అక్షర్ పటేల్ పెవిలియన్ దారి పట్టించడం కాస్తంత ఊపిరిపీల్చుకున్నట్లయింది. కానీ గ్రీన్ రూపంలో ఆసీస్‌కు సూపర్ బ్యాటర్ విజృంభణ ప్రదర్శితమయింది. బౌలర్లు వారి మీద ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో పాటు కీలక సమయంలో రెండు క్యాచ్‌లు వదిలే యడంతో ఆసీస్‌కు సువర్ణ అవకాశం ఇచ్చినట్లయింది. గ్రీన్ 30 బంతులోల్ల 61 పరుగులు స్మిత్ 24 బంతులో్ల 35 పరుగులు చేయడంలో భారత్ బౌలర్లను ఛండాడారు.
మాక్స్‌వెల్ స్కోర్ చేయకుండానే వెనుతిరిగినప్పటికీ ఆ తర్వాత వచ్చిన మాథ్యూవేడ్ భారత్బౌలర్లను బౌలింగ్ మర్చి పోయేట్టు బాదడంతో ఆసీస్ విజయం సునాయాసం అయింది. ముఖ్యంగా భువనేశ్వర్ చాలా దారుణంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లలో చాలా పరుగులిచ్చాడు. చివరి ఓవర్లో ఇంకా నాలుగు బంతులు ఉండగానే ఆసీస్ విజయం సాధించింది. ఆసీస్ విజయంలో కీలకపాత్ర వహించిన వేడ్‌కు గేమ్ ఛేంజర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా గ్రీన్‌కు అవార్డ ఇచ్చారు.