చెప్పేంత విషయాలు ఏం లేవు.. గవర్నర్
posted on Aug 21, 2015 @ 12:18PM
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్‌తో అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. అయితే గవర్నర్ భేటీపై ఇప్పుడు సర్వత్రా అసక్తి నెలకొంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్వవహారం పైనా చర్చించేందుకు కలిసారా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే భేటీ అనంతరం గవర్నర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ భేటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదని.. సంచలనమైన విషయాలు ఏం లేవని ఒక గవర్నర్ గా మాత్రమే కలిశానని చెప్పారు. కాగా ఇరురాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత సమస్యలు.. ఉద్యోగుల విభజన.. షెడ్యూల్ 9,10లోని వివాదాల వల్ల సమస్యలు.. ముఖ్యంగా ఈ సమస్యల వల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇబ్బందికర పరిస్ధితులు ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తలసాని యాదవ్ రాజీడ్రామా వ్యవహారం ఏం చర్చలోకి రాలేదని.. సరైన సరైన సమయంలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఆతరువాత గవర్నర్ నరసింహన్ దంపతులు ఇరువురు కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని పరామర్శించారు. ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయనను పరామర్శించి సంతాపం తెలియజేశారు.