రెండు రాష్ట్రాలకు గవర్నర్ సలహా
posted on Jul 10, 2015 @ 2:56PM
రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా సమస్య ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా ఇది ఎవరో ఇచ్చిన సలహా కాదు.. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ అయిన నరసింహన్ ఇచ్చిన సలహా.. అసలేందుకు ఈ సలహా ఇచ్చారో చూద్దాం..ఓటుకు నోటు కేసులో రెండు రాష్ట్రాల సీఎంలు ఒకరిమీద మాటల యుద్దాలు చేసుకోవడమేమో కానీ ఈ వ్యవహారంలో గవర్నర్ నరసింహన్ కు మాత్రం ఇద్దుర కలిసి చుక్కలు చూపించారన్నది మాత్రం వాస్తవం. ఈ కేసు విషయంలో గవర్నర్ మాత్రం అనేక రాజకీయ నేతలనుండి పలురకాల విమర్శలు వినాల్సివచ్చింది. కేసు నేపథ్యంలో సెక్షన్ 8 పై ఇరు రాష్ట్రాలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాపం దీనివల్ల గవర్నర్ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆగోల అయిపోయింది.. షెడ్యూల్ 10 తెరమీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎస్ షెడ్యూల్ 10 సంస్థలకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ సీఎస్ వేసిన పిటిషన్ వాదన తప్పని ఆంధ్రప్రదేశ్ సీఎస్, అడ్వోకేట్ జనరల్ గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారట. అసలే సెక్షన్ 8 వివాదంతో ఇసుగెత్తిపోయిన గవర్నర్ ఈ విషయంపై స్పందించి మీ రెండు రాష్ట్రాలు కూర్చొని చర్చించుకోవచ్చు కదా.. ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారట.