ఓయూ స్నాతకోత్సవానికి తెలంగాణ సెగ: నరసింహన్ వెనకడుగు

 

 

 

 

ఉస్మానియా విశ్వవిద్యాలయం 79వ స్నాతకోత్సవం సంధర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను ఆహ్వానించారు. అయితే గవర్నర్ రాకను నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాలు ఉస్మానియా బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో బంద్ కాల్ ను ఉపసంహరించుకోవాలని వీసీ విజ్ఞప్తి చేశారు. విద్యార్థి సంఘాల నాయకులతో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు చర్చలు కూడా జరిపారు. అయినప్పటికి వారు ఒప్పుకోలేదు.


తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు పంపుతూ, తెలంగాణ అంశం పట్ల చులకన భావన ఉన్న గవర్నర్ ను ఉస్మానియాలో అడుగుపెట్టినవ్వమని వారు అధికారులతో చెప్పారు. ఈ నేపథ్యంలో గవర్నర్ రాక పెద్ద వివాదంగా మారే అవకాశం ఉండడంతో చివరినిమిషంలో గవర్నర్ ఉస్మానియా స్నాతకోత్సవానికి రాకుండా తప్పుకున్నారు.  గవర్నర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో స్నాతకోత్సవానికి చివరి నిమిషంలో గోవర్దన్ మెహతాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీంతో ఓయూ క్యాంపస్‌లో భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.