వాక్సిన్ ఇచ్చిన కోతులు ఉల్లాసంగా..ఉత్సాహంగా
posted on Apr 28, 2020 @ 5:28PM
covid వాక్సిన్ దిశగా వడివడి అడుగులు వేస్తున్న Oxford మరో చల్లని కబురు అందించింది..గత మార్చి నెలలో కోతులపై చేసిన ప్రయోగం అద్భుతమైన ఫలితం ఇచ్చిందని Oxford శాస్త్రవేత్తల బృందం తెలిపింది.మొత్తం ఆరు కోతులకు ఈ వాక్సిన్ ఇవ్వగా 28 రోజుల తర్వాత కూడా అవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. విశేషమేమిటంటే ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఈ కోతులు మానవ కణజాలాలకు బాగా సారూప్యత కలిగినవే..వీటితో పాటు ఉండి వాక్సిన్ ఇవ్వని కోతులు అస్వస్థతకు గురయ్యాయి..వాటి మధ్య ఉన్నా కూడా ఈ ఆరింటికి లక్షణాలు కనిపించకపోవడం మంచి పరిణామం.
ఇప్పటికే elisaa grenato పై వాక్సిన్ ప్రయోగించిన ఆక్స్ఫర్డ్ మే నెలాఖరు నాటికి 6000 మంది మనుషులపై ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తోంది.అన్నీ సత్ఫలితాలు ఇస్తే సెప్టెంబర్ నాటికి వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఆసరికే ఇండియాలో మూడు కోట్ల వాక్సిన్లు సిద్ధంగా ఉంటాయి.
ఈ వాక్సిన్ ప్రక్రియలో oxford గణనీయమైన పురోగతి సాధించినట్టే.వాస్తవానికి కొన్ని వాక్సిన్ల తయారీకి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది.covid హడావిడి మొదలైన తర్వాత కూడా తక్కువలో తక్కువగా 12-18 నెలలు పడుతుందని ఇప్పటికీ అంటున్నారు.అలాంటి వాదనల నేపథ్యంలో అప్పుడే మానవుల మీద ప్రయోగించే దశ రావడం మెరుపు
వేగమేనని చెప్పాలి.
ఇదిలా ఉండగా Oxford మాత్రమే గాక అమెరికాకు చెందిన MODERNA,INOVIA సంస్థలు కూడా చకచకా పనిచేస్తున్నాయని అంటున్నారు.ఎక్కువ వాక్సిన్లు వస్తే త్వరితగతిన అధిక శాతం మందికి వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.Oxford ఉపయోగిస్తున్న పద్ధతిలోనే చైనాలో కూడా జరుగుతున్న పరిశోధనలు మంచి పురోగతినే సాధిస్తున్నాయి.