కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్.. మనుషుల పై ట్రయల్స్ షురూ
posted on Jun 18, 2020 @ 5:51PM
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఐతే ఇప్పటివరకు ఒక మందు కానీ, వ్యాక్సిన్ కానీ రెడీ కాలేదు. ఐతే వీటిని తయారు చేయడానికి ఎన్నో దేశాలు, సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి కానీ ఇంతవరకు ఎవరు సక్సెస్ కాలేదు. తాజాగా ఇదే విషయమై రష్యా ఒక మంచి వార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలను త్వరలో ప్రారంభించనున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మాస్కోకు చెందిన గమలేయ అనే పరిశోధన సంస్థ తాజాగా అభివృద్ధి చేసిన రెండు రకాల టీకాలును వాలంటీర్లను రెండు గ్రూపులుగా 38 మంది చొప్పున విభజించి వారి పై ప్రయోగించనున్నట్లు తెలిపింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ యొక్క భద్రత, సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కొంత మంది మిలటరీ సిబ్బంది, పౌరులను రష్యా ఎంపిక చేసింది. వీరికి గురు, శుక్రవారాలలో కరోనా లిక్విడ్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిని 21 రోజుల వరకు మాస్కోలోని కొన్ని ఎంపిక చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచి పరీక్షలు చేస్తామని ఆ శాస్త్రవేత్తలు తెలిపారు.