ఆన్ లైన్ ద్వారా పుష్కర జలాలు
posted on Jun 4, 2015 @ 12:05PM
మరో నెలరోజుల్లో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి.. అయితే ఎంతో ప్రాముఖ్యం ఉన్న గోదావరి పుష్కరాలకు వెళ్లలేని వారు చాలామంది ఉంటారు. అలాంటి వారు ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుష్కరాలకు వెళ్లలేనివారికి మేము సైతం సేవలందిస్తామంటూ ముందుకొచ్చింది పోస్టల్ డిపార్ట్ మెంట్. అదేంటంటే గోదావరి పుష్కరాలకు వెళ్లలేనివారికి పోస్టాఫీసుల ద్వారా గోదావరి నుంచి సేకరించిన నీటికి పంపిణీ చేసేందుకు సన్నద్దమయ్యారు. అంతేకాదు ఈ నీటి కోసం www.appost.in/eshop అనే సైట్ ద్వారా ఆన్ లైన్ బుకింగ్ ఏర్పాటు కూడా చేశారు. జూన్ 3 నుండి జులై 14 అన్ని పోస్టాఫీసుల్లో ఈ బుకింగ్ సేవలు వరకు అందుబాటులోకి వస్తాయని, జూలై 14 నుంచి 25 వరకు... గోదావరి జలాలను పంపిణీ చేస్తామని ఏపీ ప్రధాన పోస్ట్‌మాస్టర్ బీవీ సుధాకర్ తెలిపారు. డెలివరీ చార్జెస్‌తో కలిపి 500 ఎంఎల్ బాటిల్ ధర 20 రూపాయలుగా నిర్ణయించామని సుధాకర్ అన్నారు.