గోవా ఆర్ఎస్ఎస్ లో ముసలం.. 400 మంది రాజీనామా..
posted on Sep 1, 2016 @ 11:05AM
గోవా ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)లో ముసలం ఏర్పడింది. గోవా ఆర్ఎస్ఎస్ చీఫ్ సుభాష్ వెలింగాకర్ ను పదవి నుండి తొలగించారు. దీంతో ఆయన తొలగింపును నిరసిస్తూ దాదాపు దాదాపు 400 మందికి పైగా వాలంటీర్లు ఆర్ఎస్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుభాష్ వెలింగాకర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉంటూనే.. భారతీయ భాషా సురక్షా మంచ్ పేరిట ఓ సంస్థను నడుపుతున్నారు. అంతేకాదు ఆయన బీజేపీ పార్టీకి కీలకమైన వ్యక్తి కూడా. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించి పదవి కోల్పోయారు. వచ్చే ఏడాది గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోనుందని.. ఓ కొత్త రాజకీయ పార్టీ బీజేపీని ఓడించనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పదవిపై వేటు పడింది. మరోవైపు ఆర్ఎస్ఎస్ నేత మన్మోహన్ వైద్య మాత్రం.. సుభాష్ రాజకీయాల్లో కాలుమోపాలని భావిస్తున్నారని, సంఘ్ నేతగా రాజకీయ కార్యకలాపాలు చేయరాదు కాబట్టి విధుల నుంచి తొలగించామని అంటున్నారు. మరి ఎంతవరకూ నిజమో వారికే తెలియాలి.