గిడుగు సేవలు నేటి తరానికి ఆదర్శం.. టీడీ జనార్ధన్
posted on Sep 2, 2025 @ 1:41PM
తెలుగు భాషాసాహిత్యాలకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శంకావాలని ఎన్టీ ఆర్ లిటరేచర్ గ్లోబల్ నెట్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు,తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు టి.డి.జనార్ధన్ పేర్కొన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతివేడుకల్లో భాగంగా గిడుగుఫౌండేషన్, శంకరం వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గిడుగు జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
గిడుగువారి మార్గంలో నడిచి, తెలుగు భాషాకోసం ఎన్టీఆర్ ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. భాష పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పడమేగాక ఆయన ముఖ్య మంత్రిగా అమలు జేసిన సంక్షేమ పథకాలకు తెలుగు పేర్లు పెట్టారని అన్నారు. ప్రముఖ కవి ,గిడుగు ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గిడుగు ఫౌండేషన్ అధ్యక్షుడు గిడుగు కాంతికృష్ణ, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి ధనలక్ష్మి,శతచిత్రనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ,కవులు డా.జెల్ది విద్యాధర్, డా.వి.డి.రాజగోపాల్, డా.రాధాకృష్ఢ అతిథులుగా పాల్గొన్నారు.