కూల్చివేతలకు జీహెచ్ఎంసీ బ్రేక్: కేసీఆర్‌కి షాక్
posted on Jul 17, 2014 @ 8:08PM
హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతలను నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ తీర్మానం చేసింది. ఈమేరకు గురువారంర జరిగిన జీహెచ్‌ఎంసీ స్థాయిసంఘ సమావేశంలో తీర్మానించారు. హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతను ఆపాలని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ పాలక మండలి లేఖ రాయనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని పరిణామమేనని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కేసీఆర్‌దే అయినప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం జీహెచ్ఎంసీకే బాధ్యత వుంటుంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ అక్రమ కట్టడాలను కూల్చడానికంటే ముందు అక్రమ నిర్మాణాలకు సహకరించినవారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకున్నాకే ఆయా కట్టడాల కూల్చివేతలు జరపాలని స్థాయి సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.