ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే…
posted on Feb 2, 2016 8:19AM
ఓటు ఉంటే చాలు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఫర్వాలేదు అంటున్నారు ఎన్నికల అధికారులు. తాము సూచించిన గుర్తింపు కార్డులలో ఏది ఉన్నా కూడా పోలింగ్‌కు అనుమతిస్తామని అంటున్నారు. ఓటరు తన గుర్తింపుని నిరూపించుకునేందుకు ఎలక్షన్ అధికారులు 21 రకాల పత్రాలను అనుమతించారు. ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, బ్యాంకు లేదా పోస్టాపీసు జారీ చేసిన పాస్‌పుస్తకం, ప్రభుత్వ సంస్థలు లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు పత్రం, రేషన్ కార్డులు, ఆహార భద్రత కార్డులు, కులధృవీకరణ ప్రతాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఏటీఎం కార్డు… ఈ జాబితాలో ముఖ్యమైనవి. వీటిలో ఏది చూపించినా కూడా నేడు జరుగుతున్న జి.హెచ్.ఎం.సి ఎన్నికలలో పాలుపంచుకోవచ్చు.