గ్రేటర్ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్దం..
posted on Feb 1, 2016 @ 5:03PM
రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లో 25624 మంది, సైబరాబాద్ పరిధిలో 16 వేల సిబ్బందితో కలిపి మొత్తం 41624 మందిని నియమించామని పేర్కొన్నారు. 4860 ఆర్మీ రిజర్వు ఫోర్స్‌తోపాటు 3 వేల ఎన్నెసెస్, 1400 మంది ఎన్సీసీ వాలంటీర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించినట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. తమకు కేటాయించిన వరుసల్లో వెళ్లి మహిళా, పురుష ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 3200 పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేసి దానిని కమిషనర్ కార్యాలయంలోని కమాండ్, కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.