జీహెచ్ఎంసీ ఎన్నికలు.. సెటిలర్లకు కేసీఆర్ గాలం
posted on Jan 11, 2016 @ 12:18PM
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ సెటిలర్ల దృష్టిని ఆకర్షించడానికి పలు వ్యూహాత్మక రచనలు చేస్తంది. ఇప్పటికే కేటీఆర్ సీమాంధ్రులను ఆకట్టుకోవడానికి వాక్చాతుర్యాన్ని వాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ మరో నిర్ణయం తీసుకొని వారికి గాలం వేసినట్టు కనిపిస్తుంది. అదేంటంటే.. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పది నుంచి 12 మంది సెటిలర్లను పోటీకి దింపాలనే యోచన చేయడం. ఎందుకంటే గత 15 ఏళ్ల టిఆర్ఎస్ చరిత్రలో గ్రేటర్ ఎన్నికల్లో నిలబడే అవకాశాన్ని సెటిలర్లకు ఇవ్వనే లేదు. అలాంటిది ఇప్పుడు సెటిలర్లకు ఆ ఛాన్స్ ఇస్తుండటంతో సీమాంధ్రులకు బాగానే గాలం వేస్తున్నట్టు కనిపిస్తుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మరోవైపు ఇప్పటికే జీహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ దాదాపు 140 మంది సీమాంధ్ర సెటిలర్లు దరఖాస్తులు పెట్టుకున్నారట. దీంతో సీమాంధ్ర సెటిలర్లు అధికంగా ఉన్న డివిజన్లలో వారిని పోటీకి దింపాలని కెసిఆర్ భావిస్తున్నారు.