ముంబైలో స్పానిష్ యువతిపై అత్యాచారం
posted on Nov 7, 2012 @ 1:22PM
ముంబై నగరంలోని బాంద్రాలో ఓ అపార్ట్ మెంట్ లో స్పానిష్ యువతిమీద అత్యాచారం జరిగింది. పైప్ లైన్ పట్టుకుని పైకి ఎగబాకి అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన దుండగుడు కత్తి చూపించి బెదిరించి తాపీగా రెండుసార్లు అత్యాచారం జరిపాక నగలు దోచుకుని మరీ పారిపోయాడు.
బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా ముంబైపోలీసులు నిందితుడి స్కెచ్ ని రూపొందించారు. ఆమె ఆ రూపాన్ని పోల్చుకుందికూడా.. స్కెచ్ ని పాతఫోటోలు, రికార్డులతో పోల్చిచూసిన పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టింది ఓ లోకల్ దొంగని తేల్చారు. నిందితుడిపై గతంలో చాలా దొంగతనం కేసులున్నాయని చెబుతున్నారు.
వచ్చినపని పూర్తయ్యాకకూడా యువతి అపార్ట్ మెంట్ లోనే దాదాపు గంటసేపటివరకూ ఉన్న నిందితుడు తనకి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఏవీ దొరక్కుండా జాగ్రత్త తీసుకునిమరీ పరారయ్యాడు. బాధితురాలి బట్టలన్నీ తీసుకెళ్లడం, ఇల్లాంతా నీళ్లు చల్లడం లాంటి ట్రిక్కుల్ని ప్లే చేశాడు. బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు ఆమెపై రెండుసార్లు అత్యాచారం జరిగినట్టు ధృవీకరించారు.