మూత్రపిండాలలో పేరుకున్న విషాలు తొలగాలంటే ఇదిగో ఈ పండ్లు తినాలి..!
posted on Jan 17, 2025 @ 9:30AM
మానవ జీవనశైలి రోజురోజుకూ దిగజారిపోతోంది. జీవనశైలి మారిన కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం కారణంగా, జీవనశైలి కారణంగా శరీరంలో మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలు కూడా కలుషితం అవుతుంటాయి. ముఖ్యంగా మూత్రపిండాల పనితీరు సరిగా లేకపోతే చాలా కష్టం. మూత్రపిండాలలో పేరుకున్న విషపదార్థాలు తొలగించుకోకపోతే మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, మూత్రపిండాలలో రాళ్లు పేరుకోవడం, మూత్ర పిండాలు ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలు వస్తాయి. అలా కాకుండా మూత్రపిండాలలో పేరుకున్న విష పదార్థాలు తొలగిపోవాలంటే.. ఈ కింద చెప్పుకున్న పండ్లు తప్పనిసరిగా తినాల్సిందే..
పుచ్చకాయ, బ్లాక్‌బెర్రీస్, నిమ్మకాయ, యాపిల్, క్రాన్‌బెర్రీ వంటి పండ్లు కిడ్నీలను చాలా వేగంగా శుభ్రపరుస్తాయని వైద్యులు, ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గుతుంది.
పండ్లు కిడ్నీలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయంటే..
పుచ్చకాయ:
ఈ పండులో 92% నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది టాక్సిన్స్ ను బయటకు పంపడమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
నిమ్మకాయ:
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి ఉంటాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.
యాపిల్:
యాపిల్‌లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, వాపు తగ్గించడానికి సహాయపడుతుంది.
నేరేడు: యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే నేరేడు కిడ్నీలకు బాడీగార్డ్ లాగా పనిచేస్తంది. ఇందులో ఉండే తక్కువ పొటాషియం స్థాయి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కిడ్నీ కణాలను రక్షిస్తుంది.
క్రాన్‌బెర్రీ:
యూటీఐ నివారణకు క్రాన్‌బెర్రీ మంచి పండు. దీని వినియోగం అనేక విధాలుగా మూత్రపిండాల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
పైనాపిల్:
పైనాపిల్ బ్రోమెలైన్ రిచ్ తక్కువ పొటాషియం పండు. బ్రోమెలైన్ అనేది ఒక ఎంజైమ్, ఇది వాపును తగ్గిస్తుంది.
పండ్లు ఎప్పుడు తినాలి?
ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, సమతుల్య ఆహారంలో భాగంగా పండ్లను ప్రతిరోజూ అల్పాహారంగా తీసుకోవచ్చు. రోజూ ఒక మీడియం కప్పు పండ్లను తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం సేఫ్ గా ఉంటుంది.
జాగ్రత్త..
కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు పండ్లను తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాటిని తీసుకునే ముందు వైద్యుడిని తప్పకుండా సంప్రదించిన తరువాతే తినాలి.
*రూపశ్రీ.