పండ్ల రసాల సీక్రెట్
posted on May 29, 2013 @ 11:34AM
పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచిది అని తెల్సిందే కదా. అయితే పిల్లలే కాదు మనం కూడా చాలాసార్లు ఇష్టమంటూ ఏదో ఓ పండునే ఎక్కువగా తీసుకుంటూవుంటాం. అలాకాక అవసరాన్ని బట్టి శారీరక పరిస్టితిని బట్టి అప్పుడప్పుడు పళ్ళ రసాల్ని మార్చి, మార్చి తాగటం మంచిది అంటున్నారు నిపుణులు.
ఉదాహరణకి బాగా అలసటగా ఉంటే
a) ఆపిల్, క్యారెట్ , కమలా రసాలు తాగితే అలసట దూరమవుతుంది.
b) ఒత్తిడిగా,
అదే బాగా ఒత్తిడిగా అనిపించినపుడు టమాటో లేదా క్యారెట్ రసాలు తీసుకుంటే ఒత్తిడితగ్గుతుంది.
c) రక్త హీనత
ఖర్జూరాలు , ద్రాక్షపళ్ళు రసాలు రక్తహీనతని తగ్గిస్తాయి.
d) రోగ నిరోధక
రోగ నిరోధక శక్తి పెరగటానికి ఆపిల్, నిమ్మ, క్యారెట్ , అల్లం రసాలు చక్కగా పనిచేస్తాయి.
e) జీర్ణశక్తికి
జీర్ణశక్తికి ఆపిల్ ,క్యారెట్ రసాలు పైనాపిల్, పుదీనా నిమ్మ రసాలు ఎప్పుడు తీసుకున్న వెంటనే శారీరక, మానసిక అలసట ఒత్తిడిని తగ్గించి రిలాక్స్ అయ్యేలా చేస్తాయిట.
...రమ